యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కూతుళ్లు కూడా సినిమాలోకి వచ్చిన విషయం తెలిసిందే. శివాని, శివాత్మిక ఇద్దరూ కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే వీరిద్దరి సినిమాలు రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకున్నారు, వరుస సినిమాలని లైన్లో పెట్టారు. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని చెల్లెలు శివాత్మిక కంటే లేట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. శివాని (Shivani Rajasekhar)ఇటీవలే విడుదలైన ‘అద్భుతం’సినిమాతో అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత www సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం శివాని మరో రెండు సినిమాల్లో చేస్తుంది. ఇందులో ఒక తమిళ్ సినిమా కూడా ఉంది.
ఇక శివాని సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన ఫొటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా శివాని మరో ఇంట్రస్టింగ్ విషయాన్ని తన అభిమానులకు షేర్ చేసింది. శివాని మిస్ ఇండియా 2022(Femina Miss India Compitation 2022) పోటీల్లో పాల్గొనబోతున్నట్టు తెలిపింది. ఈ మేరకు శివాని కొన్ని ఫోటోలని షేర్ చేసి..‘మీ అందరి ఆశీర్వాదాలు మరియు ప్రేమను కోరుకుంటూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఫెమినా మిస్ ఇండియా ఆర్గనైజేషన్ కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇందులో పాల్గొనబోతున్న అందమైన మహిళలందరికీ నాతో సహా ఆల్ ది వెరీ బెస్ట్’ అంటూ పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు, పలువురు సెలబ్రిటీలు శివానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
View this post on Instagram
శివాని 1996లో చెన్నైలో నటులు రాజశేఖర్(Rajasekhar), జీవిత(Jeevitha) దంపతులకు జన్మించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమె తెలుగులో ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే మరియు కల్కి సినిమాలు నిర్మించింది. శివాని 2018లో '2 స్టేట్స్' సినిమా ద్వారా హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఇక రాజశేఖర్ హీరోగా వస్తున్న శేఖర్ మూవీలో కూడా శివాని నటిస్తోంది. తండ్రితో కలిసి తొలిసారిగా ఆమె వెండితెరపై కనిపించనుంది. మరోవైపు శివాని మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడటంతో అభిమానులు ఆమె గెలవాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శివానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.