సమీరా రెడ్డి మరో సాహసం.. చంటిపిల్లతో ఎత్తైన పర్వతం ఎక్కిన భామ..

గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో తాను గర్భవతి అన్న విషయాన్ని తెలుపుతూ సమీరా రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ భామ.. తన పిల్లతో కలిసి కర్ణాటకలో మరో అద్భుతాన్ని క్రియేట్ చేసింది.

news18-telugu
Updated: October 1, 2019, 8:23 AM IST
సమీరా రెడ్డి మరో సాహసం.. చంటిపిల్లతో ఎత్తైన పర్వతం ఎక్కిన భామ..
సమీరా రెడ్డి (Instagram/Photo)
  • Share this:
గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో తాను గర్భవతి అన్న విషయాన్ని తెలుపుతూ సమీరా రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు ఆ పాపు నైరా అనే పేరు కూడా పెట్టింది. తాజాగా ఈ భామ తన రెండు నెలల కూతురితో పెద్ద సాహసమే చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని అతి ఎత్తైన మల్లయన గిరి పర్వతం ఎక్కింది. పర్వతం పైకి వెళ్తుండగా దారి మధ్యలో ఓ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ‌లో పోస్ట్ చేసింది. ఇది 6300 అడుగుల ఎత్తైన పర్వతం. ఒక బిడ్డకు డెలివరి ఇచ్చిన తర్వాత ఏ మాత్రం భయపడకుండా.. తల్లులు మరింత ఎనర్జీతో ముందుకు సాగాలంటూ ఓ సందేశాన్ని ఇచ్చింది సమీరా. తన కూతురితో కలిసి చేసిన ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది.Published by: Kiran Kumar Thanjavur
First published: October 1, 2019, 8:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading