సెలెబ్రిటీ జంట సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఇరువురు త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని కొన్ని రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ స్పందించని చైతన్య, సమంతలు సడెన్’గా నిన్న సామాజిక మాధ్యమాల్లో అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో షాక్ అవ్వడం అక్కినేని ఫ్యాన్స్ వంతు అయ్యింది. ఇక అది అలా ఉంటే గతంలో సమంత పేరు మార్చుకున్నప్పుడే చాలా వరకు నెటిజన్స్ ఏదో జరుగబోతుందని కామెంట్స్ చేశారు. సమంత అక్కినేనిగా ఉన్న పేరును ఆమె ఎస్‌గా మార్చారు. ఇలా కొన్నాళ్ల పాటు కొనసాగిన సమంత మరోసారి తాజాగా సోషల్ మీడియాలో తన పేరును మార్చారు.
నిన్న అధికారికంగా నాగ చైతన్యతో విడిపోతున్నానని ప్రకటన చేసిన తర్వాత మళ్లీ 'ఎస్' అక్షరాన్ని తొలగించి 'సమంత'గా మార్చేసుకు న్నారు. ఇక సమంత సినీ కెరీర్ విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని గుణ శేఖర్ (Gunasekhar) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
Naga Chaitanya | Sai Pallavi : సాయి పల్లవితో ఆ ముద్దు సీన్ కోసం ఆరు గంటల సమయం పట్టిందా..
ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో కాకుండా డిస్నీ హాట్ స్టార్‌లో డైరెక్టు రిలీజ్ కానుందని తెలుస్తోంది.
ఇక సమంత ఇటీవల అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అనేక వివాదాల నడుమ మంచి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ వెబ్ సీరిస్‌లో సమంత రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో కనిపించింది. రాజీ పాత్రలో పాత్రలో సమంత ఇరగదీసిందనే చెప్పోచ్చు. తన నటనతో పాటు డైలాగ్ డెలివరీ, ఆ పాత్ర కోసం సమంత ఫిట్ నెస్, డీ గ్లామర్ లుక్‌లో నటిస్తూ వావ్ అనిపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya Samantha Divorce, Samantha Ruth Prabhu, Tollywood news