Home /News /movies /

ACTRESS SAMANTHA AKKINENI THE FAMILY MAN WEB SERIES WILL REALESE ON THIS SUMMER READ FULL DETAILS MNJ

Samantha Akkineni- Family Man 2: స‌మంత వెబ్‌సిరీస్ స‌మంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఫ్యామిలీ మ్యాన్ 2 ఎప్పుడు విడుద‌ల కానుందంటే

samantha Instagram

samantha Instagram

Samantha Akkineni: టాలీవుడ్ బ్యూటీ, అక్కినేని కోడ‌లు స‌మంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌సిరీస్‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. మ‌నోజ్ బాజ్‌పేయి, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ వెబ్ సిరీస్‌లో విల‌న్ పాత్ర‌లో సమంత న‌టిస్తుండం మ‌రో విశేషం. కాగా ఇప్ప‌టికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మంచి విజ‌యాన్ని సాధించ‌గా.. సీజ‌న్ 2పై అందరిలోనూ అంచ‌నాలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    Samantha Akkineni: టాలీవుడ్ బ్యూటీ, అక్కినేని కోడ‌లు స‌మంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌సిరీస్‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. మ‌నోజ్ బాజ్‌పేయి, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ వెబ్ సిరీస్‌లో విల‌న్ పాత్ర‌లో సమంత న‌టిస్తుండం మ‌రో విశేషం. కాగా ఇప్ప‌టికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మంచి విజ‌యాన్ని సాధించ‌గా.. సీజ‌న్ 2పై అందరిలోనూ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే షూటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే విడుద‌ల అవ్వాల్సి ఉంది. ఫిబ్ర‌వరి 12న ఈ వెబ్ సిరీస్‌కు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల‌న ఫ్యామిలీ మ్యాన్ 2 విడుద‌ల కాలేదు. అప్ప‌టికే అమెజాన్‌లో విడుద‌లైన తాండ‌వ్, మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్‌లు వివాదంలో చిక్కుకోవ‌డంతో.. ఓటీటీలో విడుద‌ల‌య్యే సిరీస్‌లు, సినిమాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి పెట్టింద‌ని.. ఈ క్ర‌మంలో ఫ్యామిలీ మ్యాన్ 2, పాతాళ్ లోక్ 2 వెబ్ సిరీస్‌లను అమెజాన్ క్యాన్సిల్ చేసింద‌ని టాక్ న‌డిచింది.

    అయితే ఆ వార్త‌ల‌ను మ‌నోజ్ బాజ్‌పేయ్ ఖండించారు. ఫ్యామిలీ మ్యాన్ 2 క్యాన్సిల్ అవ్వ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. అలాగే ఈ వెబ్ సిరీస్ డైరెక్ట‌ర్లు రాజ్‌, డీకేలు కూడా ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ క‌చ్చితంగా విడుద‌ల అవుతుంద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సిరీస్ విడుద‌ల గురించి మ‌నోజ్ బాజ్‌పేయ్ స్పందించారు. ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన మ‌నోజ్ బాజ్‌పేయ్ ఫ్యామిలీ మ్యాన్ 2 ఈ వేస‌విలో విడుద‌ల అవుతుందని తెలిపారు. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే అమెజాన్ అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌నుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.




    ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం స‌మంత తెలుగులో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంతలంలో న‌టిస్తోంది. పౌరాణిక క‌థా నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇక త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న కాటువాకులా రెండు కాదల్ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీకి సంబంధించి ఇప్ప‌టికే స‌మంత షూటింగ్ పూర్తి కాగా.. ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
    Published by:Manjula S
    First published:

    Tags: Samantha, Samantha akkineni, The Family Man Season 2

    తదుపరి వార్తలు