అంత బరువు ఎలా ఎత్తావు సమంత..ఆశ్చర్యపోతోన్న అభిమానులు

కొంతమంతి హీరోయిన్స్ పెళ్లైన తర్వాత శరీర సౌష్టవంపై శ్రద్ద చూపించరు. కానీ సమంత అలా కాదు. తన శరీర ఆకృతిని కాపాడుకోవాడానికి ఆమె నిరంతరం కష్టపడుతూనే ఉంటారు.

news18-telugu
Updated: May 22, 2019, 6:23 PM IST
అంత బరువు ఎలా ఎత్తావు సమంత..ఆశ్చర్యపోతోన్న అభిమానులు
సమంత అక్కినేని (Samantha Akkineni)
  • Share this:
సమంత తెలుగులో టాప్ హీరోయిన్. ఇటీవల ఆమె నటించిన ‘మజిలీ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆమె మరో సినిమా ‘ఓ బేబీ’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది. నిన్ననే ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. దీనికి తోడు ప్రస్తుతం సమంత ‘మన్మథుడు 2’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తెలుగులో ఆమెకు ఉన్న ఈ క్రేజ్.. ప్రస్తుత స్థానం ఊరికే రాలేదు. స్వయంకృషితో ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇక్కడివరకు వచ్చి..ప్రస్తుత స్థానానికి చేరుకున్నారు సమంత. అది అలా ఉంటే.. కొంతమంతి పెళ్లైన తర్వాత శరీర సౌష్టవంపై అశ్రద్ద చూపుతారు, శరీర ఆకృతిపై పెద్దగా ఆసక్తి ఉండదు, కానీ సమంత అలా కాదు. తన శరీర ఆకృతిని కాపాడుకోవాడానికి ఆమె నిరంతరం కష్టపడుతూనే ఉంటోంది. ఈ శ్రద్ద పెళ్లైన తర్వాత ఎక్కవైనట్లు కనబడుతోంది. అందులో భాగంగా ఆమె నాజుగ్గా ఉండడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, శారీరక దారుఢ్యాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


అందులో భాగంగా తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో హల్‌చల్ చేస్తూ నెటిజెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో సమంత తాజాగా 100 కిలోల బరువును సునాయాసంగా ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సమంత అంత బరువును సూనాయసంగా ఎత్తుతూ వ్యాయామం చేయడం నెటిజెన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అభిమానులు మాత్రం సమంత.. ‘100 కిలోలు లిఫ్ట్‌ చేయడం మాటలు కాదు, ఐరన్‌ లేడీ, ఎలా చేశావ్‌ సామ్.. మీరు సూపర్’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను కింద చూడోచ్చు.

First published: May 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading