సమంతను వెంటాడుతున్న ఆ భయం..

సమంతాకు సినిమాలకు సంబందించి విడుదల సమయంలో ఎప్పుడూ ఓ భయం వెంటాడుతూ ఉంటుందట.

news18-telugu
Updated: April 26, 2019, 1:48 PM IST
సమంతను వెంటాడుతున్న ఆ భయం..
సమంత అక్కినేని Photo: Instagram
news18-telugu
Updated: April 26, 2019, 1:48 PM IST
సమంత, నాగ చైతన్య జోడీగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన 'మజిలీ' సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీగా కలెక్షన్స్ రాబడుతోన్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత మొదటిసారిగా తెర పంచుకున్న ఈ జంట ప్రేక్షకులను మైమరిపించే ప్రదర్శన కనబర్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్టుబడి చాలా చోట్ల వెనక్కి వచ్చేయడమే కాకుండా లాభాలు తీసుకొచ్చింది మజిలీ. ఇప్పటికే రూ. 50 కోట్ల  గ్రాస్ క్రాస్ చేసిన ఈ సినిమా,  త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్బులో చేరడానికి ఎంతో సమయం పట్టదు. మరోవైపు ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం రప్ఫాడిస్తుంది. ఈ సినిమాలో సమంత నటన అందర్ని ఆకట్టుకుంది. సమంతా ఈ సినిమాలో నటించడం వలన అదిరిపోయే ఓపినింగ్స్ వచ్చాయని, ఆ తర్వాత కూడా అదే ఊపు అలానే కొనసాగిందని..ఆ విధంగా సినిమాకు సూపర్ కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు సినీ పండితులు.

సమంత, నాగ చైతన్య Photo: Instagram


అది అలా వుంటే సమంతాకు సినిమాలకు సంబందించి విడుదల సమయంలో ఎప్పుడూ భయం వెంటాడుతూ ఉంటుందట. ఆమె నటించిన సినిమాలు సక్సెస్ అవుతాయో లేదోనని విడుదలకు ముందు సమంత చాలా టెన్షన్ పడుతూ, మిగితా వారిని టెన్షన్ పెడుతూ తెగ భయపడుతూ ఉంటుందట. ముందుగా కథ వినేటప్పుడు గాని.. లేదా షూటింగ్ చేస్తున్నప్పుడు గాని.. పాజిటివ్‌గా అనిపించినప్పటికీ, తీరా సినిమా విడుదలయ్యే సమయంలో, తాను చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో అనే భయం తనకు చాలా ఉంటుందని..ఈ విషయంలో తెగ భయమేస్తుంటుందని అంటోంది సమంత. అయితే ఆమె భయపడటమే కాదు..తన భర్త చైతన్యను కుడా బాగా భయపెడుతూ విసిగిస్తుందట. ఈ భయం ఏదో ఒక సినిమాకు కాదట తన ప్రతీ సినిమాకు ఆ భయం వెంటాడుతూనే ఉంటుందని చెబుతోంది సమంత. ఇంకా ఆమె మాట్లాడుతూ, సినిమా పూర్తయ్యాక ఎడిటింగ్ సమయంలో ఆ సీన్స్ చూసి అసలు ఈ సినిమా చేశానేంటి? ఇంతకీ ఇది హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా? అనే అనుమానం తనకు ఎప్పుడూ ఉంటుందని చెబుతోంది సమంత

First published: April 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...