కామసూత్ర 3D నటి మృతి.. మృతి కంటే అదే ఎక్కువ షాక్ అనిపించిందన్న డైరెక్టర్..

Kamasutra 3D Actress Died : ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టిన సైరా.. కామసూత్ర లాంటి సినిమా చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడిందో ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

news18-telugu
Updated: April 21, 2019, 3:16 PM IST
కామసూత్ర 3D నటి మృతి.. మృతి కంటే అదే ఎక్కువ షాక్ అనిపించిందన్న డైరెక్టర్..
నటి సైరా ఖాన్
  • Share this:
బాలీవుడ్ నటి సైరా ఖాన్ గుండెపోటుతో కన్నుమూశారు. 2013లో రూపేష్ పాల్ దర్శకత్వంలో వచ్చిన కామసూత్ర 3D చిత్రంతో ఆమె పాపులర్ అయ్యారు. సైరా ఖాన్ మృతిపై రూపేష్ పాల్ విచారం వ్యక్తం చేశారు. ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టిన సైరా.. కామసూత్ర లాంటి సినిమా చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడిందో ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. చాలా నెలల తర్వాత ఎట్టకేలకు ఆమెతో సినిమా చిత్రీకరించామని.. అన్ని నెలలు వేచి చూసినందుకు తగిన ఫలితం దక్కిందని అన్నారు. సైరా కాకుండా మరెవరూ ఆ సినిమా చేసినా ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయేవారని చెప్పారు.

సైరా మృతి వార్త షాకింగ్ అనిపించింది. కానీ ఆమె మృతిని ఏ ఒక్క మీడియా సంస్థ కూడా పట్టించుకోకపోవడం మరింత బాధాకరం అనిపించింది. అందుకే ఆమె మృతిపై నేనే ఒక ప్రకటన విడుదల చేస్తున్నాను. నిజానికి సైరా లాంటి నటికి చాలా గుర్తింపు రావాల్సింది. ఏదేమైనా ఇది సంతాప సందర్భం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భావిస్తున్నా.
రూపేష్ పాల్, కామసూత్ర డైరెక్టర్
First published: April 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు