కథక్ నేర్చుకుంటున్న రోష్నీ వాలియా...

Roshni Walia : ఇప్పుడిప్పుడే కెరీర్ డెవలప్ చేసుకుంటూ... బాలీవుడ్‌లో సందడి చేస్తున్న రోష్నీ... కథక్‌తో మెప్పిస్తుందా?

news18-telugu
Updated: January 24, 2020, 1:19 PM IST
కథక్ నేర్చుకుంటున్న రోష్నీ వాలియా...
రోష్నీ వాలియా (credit - insta - roshniwaliaa)
  • Share this:
Roshni Walia : అందానికి అభినయం తోడైతే... ఆఫర్లు అవే వస్తాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ క్యూట్ గర్ల్ రోష్నీ వాలియా. టీవీలో యాడ్స్‌తో కెరీర్ ప్రారంభించి... వెంటనే మై లక్ష్మీ తేరే ఆంగన్‌కీ వంటి టీవీ షోల్లో మెరిసిన ఈ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ బ్యూటీ... ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆర్మీ ఫ్యామిలీ నుంచీ వచ్చిన రోష్నీ... 2012లో మై ఫ్రెండ్ గనేశా 4తో... బాల నటిగా సినిమాల్లో కెరీర్ వెతుక్కుంది. ఆ తర్వాత మచ్లీ జల్ కీ రాణీ హై, ఫిరంగి సినిమాల్లో చేసింది. 2019లో డాటర్ ఆఫ్ కచ్‌తో మెరిసింది. తాజాగా కథక్ నేర్చుకుంటోంది. తన జీవితంలో మొదటిసారిగా కథక్ నేర్చుకుంటున్నానన్న ఈ బ్యూటీ... అది కాస్త కష్టంగా ఉన్నా... ఇష్టంగానే ఉందని చెబుతోంది. ఇందుకు సంబంధించి ఓ చిన్న వీడియో క్లిప్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. 

View this post on Instagram
 

❤️🔚


A post shared by Roshni Walia (@roshniwaliaa) on

ఓవైపు సినిమాలు చేస్తూనే... మరోవైపు తనకు లైఫ్ ఇచ్చిన బుల్లి తెరను కూడా వదల్లేదు రోష్నీ. ప్రస్తుతం తార ఫ్రం సితార సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తోంది. ఇలా అన్ని వైపులా కెరీర్ డెవలప్ చేసుకుంటూ... ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ని ఫాలోయర్లతో పంచుకుంటూ... చిలిపిగా నవ్వేస్తోంది రోష్నీ వాలియా.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు