ACTRESS REVATHY SAMPATH RELEASES LIST OF NAMES WHO ALLEGEDLY HARASSED HER SU
Revathy Sampath: నన్ను వేధించిన వారు వీళ్లే.. 14 మందితో జాబితా విడుదల చేసిన నటి.. ఆ జాబితాలో ప్రముఖ నటుడి పేరు కూడా..
రేవతి సంపత్
మీటూ ఉద్యమంతో పలువురు సినీ తారలు తాము ఎదుర్కొన్న వేధింపులకు గురించి బయటపెట్టారు. తాజాగా నటి రేవతి సంపత్ 14 మంది తనను పలు రకాలుగా వేధించినట్టుగా ఆరోపించింది.
మీటూ ఉద్యమంతో పలువురు సినీ తారలు తాము ఎదుర్కొన్న వేధింపులకు గురించి బయటపెట్టారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి, తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి నోరు విప్పారు. తాజాగా మలయాళ నటి, సోషల్ యాక్టివిస్ట్ రేవతి కూడా ఈ జాబితాలో చేరారు. తనను 14 మంది వేధింపులకు గురిచేసినట్టుగా ఆమె ఆరోపించారు. ఈ మేరకు వారి జాబితాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారిలో తనను శారీరకంగా, మానసికంగా, అసభ్య పదజాలంతో వేధించిన వారు ఉన్నట్టు రేవతి సంపత్ చెప్పుకొచ్చారు. ఈ జాబితాలో పలువురు ప్రముఖల పేర్లు కూడా ఉన్నాయి. దర్శకుడు రాజేష్ టచ్రివర్, నటుడు సిద్దిక్ల రేవతి విడుదల చేసిన జాబితాలో ఉండటం కలకలం రేపింది. సినీ పరిశ్రమకు చెందినవారే కాకుండా.. డివైఎఫ్ఐ కమిటీ మెంబర్, ఓ డాక్టర్, ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా తనను వేధించినట్టు రేవతి విడుదల చేసిన జాబితాలో ఉన్నారు.
గతంలో కూడా రేవతి సంపత్.. నటుడు సిద్దిక్పై వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా జాబితాలో కూడా అతని పేరును రేవంతి పొందుపరిచింది. ఈ ఆరోపణలకు కొందరు మద్దతుగా నిలవగా.. మరికొందరు దీనిని పబ్లిసిటీ స్టంట్ అని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.