• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ACTRESS RENU DESAI GIVES CLARITY ON MAHESH BABU SARKARU VAARI PAATA MOVIE MNJ

Renu Desai: మ‌హేష్ బాబు 'స‌ర్కారు వారి పాట‌'లో రేణు దేశాయ్‌.. క్లారిటీ ఇచ్చిన న‌టి

Renu Desai: మ‌హేష్ బాబు 'స‌ర్కారు వారి పాట‌'లో రేణు దేశాయ్‌.. క్లారిటీ ఇచ్చిన న‌టి

రేణు దేశాయ్ మహేష్ బాబు(File photo)

మహేష్ బాబు(Mahesh Babu) సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata)లో నటి రేణు దేశాయ్(Renu Desai) న‌టించ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య‌న వార్త‌లు వ‌చ్చాయి. ఒక కీల‌క పాత్ర‌లో న‌టించేందుకు రేణు ఓకే చెప్పిన‌ట్లు టాక్ న‌డిచింది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపించాయి.

  • Last Updated:
  • Share this:
    Renu Desai: ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టించ‌నున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను జ‌రుపుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి త‌రువాత సెట్స్ మీద‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. ఇక ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్ కన్ఫర్మ్ అయ్యింది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఇక ఈ మూవీలో మిగిలిన పాత్రాధారుల‌కు సంబంధించి ఇప్ప‌టికే ప‌లు పుకార్లు వినిపించాయి. ఈ క్ర‌మంలో ఈ మూవీలో పవ‌న్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ న‌టించ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య‌న వార్త‌లు వ‌చ్చాయి. ఒక కీల‌క పాత్ర‌లో న‌టించేందుకు రేణు ఓకే చెప్పిన‌ట్లు టాక్ న‌డిచింది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపించాయి.

    ఈ క్ర‌మంలో ఆ వార్త‌ల‌పై రేణు దేశాయ్ స్పందించారు. ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న రేణు దేశాయ్.. అక్క‌డ అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. అందులో భాగంగా మీరు మ‌హేష్ బాబు స‌ర్కారు పాట‌లో న‌టిస్తున్నారా..? అని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించగా.. లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఏదైనా ఉంటే తాను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తాన‌ని రేణు వెల్ల‌డించారు.








    View this post on Instagram






    A post shared by renu desai (@renuudesai)






    ఇటీవ‌ల తాను ఓ వెబ్ సిరీస్‌లో న‌టించాన‌ని, ఆ షూటింగ్ పూర్తి అయ్యింద‌ని, త్వ‌ర‌లోనే దానికి సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాన‌ని రేణు తెలిపారు. అలాగే ప్ర‌స్తుతం తాను తెలుగు సినిమాల్లోనే న‌టిస్తాన‌ని మ‌రో క్రేజ్ ప్రాజెక్ట్‌కి కూడా ఓకే చెప్పాన‌ని ఆ వివ‌రాలు త్వ‌ర‌లోనే చెబుతాన‌ని అన్నారు. ఇక రైతుల మీద తాను తీసే సినిమా ఎట్ట‌కేల‌కు మార్చిలో ప్రారంభం కానుంద‌ని, అందుకోసం తాను ఎదురుచూస్తున్నాన‌ని వివ‌రించారు. అలాగే త‌న డైరెక్ష‌న్‌లో మరో సినిమా కోసం క‌థ‌ను రాస్తున్నాన‌ని రేణు దేశాయ్ వివ‌రించారు.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు