Home /News /movies /

ACTRESS RASHMIKA MANDANNA COMMENTS ON VIJAY DEVERAKONDA LIGER POSTER MNJ

Vijay Deverakonda Liger- Rashmika Mandanna: 'లైగ‌ర్' పోస్ట‌ర్‌పై ర‌ష్మిక మంద‌న్న కామెంట్.. కార‌ణం నీకు కూడా తెలుస‌న్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజయ్ దేవరకొండ రష్మిక మందన్న

విజయ్ దేవరకొండ రష్మిక మందన్న

పూరీ జ‌గ‌న్నాథ్, విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం లైగ‌ర్. ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ కూడా తాజాగా విడుద‌లైంది. లైగ‌ర్ అంటే పులి, సింహంకు పుట్టిన జంతువు కాగా.. అంద‌రికీ అర్థం అయ్యేలా దాన్ని పోస్ట‌ర్‌లోనే చూపించాడు పూరీ.

ఇంకా చదవండి ...
    Vijay Deverakonda Liger- Rashmika Mandanna: పూరీ జ‌గ‌న్నాథ్, విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం లైగ‌ర్. ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ కూడా తాజాగా విడుద‌లైంది. లైగ‌ర్ అంటే పులి, సింహంకు పుట్టిన జంతువు కాగా.. అంద‌రికీ అర్థం అయ్యేలా దాన్ని పోస్ట‌ర్‌లోనే చూపించాడు పూరీ. అంతేకాదు ఈ టైటిల్ కింద సాలా క్రాస్‌బ్రీడ్ అంటూ హాట్ క్యాప్ష‌న్‌ని కూడా పెట్టాడు డ్యాషింగ్ డైరెక్ట‌ర్. ఇక‌ ఈ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకోగా.. ప్ర‌స్తుతం టాప్ ట్రెండింగ్‌లో న‌డుస్తోంది. మ‌రోవైపు ఈ పోస్ట‌ర్‌తో ఫ్యాన్స్ కూడా సంతోష‌ప‌డుతున్నారు. పోస్ట‌ర్ అదిరిపోయిందంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ పోస్ట‌ర్‌పై న‌టి ర‌ష్మిక మంద‌న్న కామెంట్ పెట్టారు.

    ''చాలా గ‌ర్వంగా ఉంది. కిల్ల‌ర్ పోస్ట‌ర్. ఈ మాస్ట‌ర్ పీస్‌ని స్క్రీన్ మీద చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఉన్నా. అప్పుడు లేచి విజిల్స్ వేస్తూ డ్యాన్స్ వేస్తా. నా స్వీట్ బీస్ట్‌ల‌కు ఆల్ ది బెస్ట్'' అని ర‌ష్మిక మంద‌న్న కామెంట్ పెట్టారు.



    ఇక ఆ పోస్ట్‌కి విజ‌య్ స్పందించాడు. రుషీ.. నీతో పాటు థియేట‌ర్ల‌లో చాలా మంది నిల్చుంటారని ప్రామిస్ చేస్తున్నా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కొత్త స్ట‌ఫ్‌ని చూశావు క‌దా అని కామెంట్ పెట్టాడు.



    కాగా ఈ మూవీతో విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక లైగ‌ర్‌లో విజ‌య్ ఫైట‌ర్‌గా క‌నిపిస్తుండ‌గా.. ఆయ‌న స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే జ‌త‌కడుతోంది. ర‌మ్య‌కృష్ణ‌, రోనిత్ రాయ్, విషు రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. పూరీ క‌నెక్ట్స్, క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

    ఇదిలా ఉంటే ర‌ష్మిక మంద‌న్న కూడా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా తెర‌కెక్కుతున్న మిష‌న్ మ‌జ్నులో ర‌ష్మిక నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చ‌న్ చిత్రంలోనూ ర‌ష్మిక‌కు ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.
    Published by:Manjula S
    First published:

    Tags: Liger Movie, Puri Jagannadh, Rashmika mandanna, Vijay Devarakonda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు