తన సినిమాలతో రమ్యకృష్ణకు గ్లామరస్ ఇమేజ్ తీసుకొచ్చిన రాఘవేంద్రరావు ముఖ్యపాత్రలో నటిస్తున్న సినిమా ఇది కావడం ఇక్కడ విశేషం.
(Image: Instagram)
Ramya Krishna- Liger movie: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Ramya Krishna- Liger movie: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో లేడి సూపర్‌స్టార్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్లో ప్రస్తుతం ఆమె పాల్గొంటుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం రమ్యకృష్ణ ఊహించని లుక్‌లోకి మారిపోయింది. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ షూటింగ్ సెట్స్‌లో తీసుకున్న ఓ ఫొటోను రమ్యకృష్ణ తన సోషల్ మీడియాలో అబిమానులతో పంచుకున్నారు. బేస్తవారి లుక్‌లో రమ్యకృష్ణ కనిపించారు. ఈ ఫొటోను చూసిన అభిమానులు షాక్‌కి గురి అవుతున్నారు.
కాగా సాధారణంగా పూరీ జగన్నాథ్ తల్లి పాత్రలను బలంగా రాస్తుంటారు. అమ్మ నాన్న తమిళమ్మాయి, లోఫర్ చిత్రాల్లో తల్లి పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఇప్పుడు లైగర్‌లోనూ రమ్యకృష్ణ పాత్ర గుర్తుండిపోయే విధంగా పూరీ కథను రాసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. రోనిత్ రాయ్, అలీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. 2019లో ఇస్మార్ట్ శంకర్ విజయం తరువాత పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకొంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.