‘రొమాంటిక్’ సినిమాలో రమ్యకృష్ణ... లీడ్‌ రోల్‌లో శివగామి

‘రొమాంటిక్’ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 16, 2019, 11:07 AM IST
‘రొమాంటిక్’ సినిమాలో రమ్యకృష్ణ... లీడ్‌ రోల్‌లో శివగామి
‘రొమాంటిక్’ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నట్లు తెలుస్తోంది.
  • Share this:
రమ్యకృష్ణ అంటేనే అదిరిపోయే యాక్టింగ్... కథనాయికగా అయినా.. ప్రతీనాయికగా అయినా ఆమె నటన అద్భుతం. సెకండ్ ఇన్నీంగ్స్‌లో కూడా ఆమె యాక్టింగ్‌లో ఏ మాత్రం తగ్గడం లేదు. బాహుబలి సినిమాలో శివగామిగా అందరి మన్ననలు పొందారు. శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో నాగచైతన్య అత్త క్యారెక్టర్‌లో రమ్యక‌ష్ణ ఫెర్‌ఫామెన్స్ హైలెట్‌‌గా నిలిచింది. ఇప్పుడు మరో సినిమాలో కీలక పాత్రలో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు రమ్య.

దర్శకుడు పూరి జగన్నాథ్ సొంత బ్యానర్లో ఆయన కుమారుడు ఆకాశ్ హీరోగా తీస్తున్న 'రొమాంటిక్' చిత్రలో రమ్య కూడా నటిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ అనే కొత్త యువకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కథ - మాటలు పూరి అందించారు. ఇప్పటికి ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి కేతిక శర్మ అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమవుతోంది.‘రొమాంటిక్’ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారనేది తాజా సమాచారం.ఈ సినిమా అంతా రమ్యకృష్ణ కనిపిస్తారనీ, ఆమె పాత్రను పూరి గొప్పగా డిజైన్ చేశాడని చెప్పుకుంటున్నారు. రమ్యకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన పాత్రగా ఈ సినిమా రోల్ కూడా ఉంటుందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు