Rakul Preet Singh: ఫిజిక్ విషయంలో ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యేందుకు ఇష్టపడదు. ఎంత పని ఉన్నా కనీసం 4 గంటలు జిమ్ లేకుండా ఈ భామ రోజు గడవదు. పైగా రకుల్‌కి సొంత జిమ్‌లు కూడా ఉండగా.. అక్కడ కూడా భారీగానే సంపాదిస్తుంది. కాగా తాను జిమ్‌లో ఈ బ్యూటీ భారీ వర్కౌట్లను కూడా చేస్తుంటారు. అప్పుడప్పుడు వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా రకుల్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఈ బ్యూటీ అప్ అండ్ డౌన్ స్వ్కాట్స్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ వీడియోకు రకుల్ ఇంట్రస్టింగ్ కామెంట్‌ని కూడా పెట్టారు.
జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు ఉంటాయి. వాటిని నేను స్క్వాట్స్ అని పిలుస్తాను అని రకుల్ కామెంట్ పెట్టారు. ఇక ఆ పోస్ట్‌కి బర్న్, స్ట్రాంగ్ ఈజ్ ద న్యూ సెక్సీ, ఫిట్నెస్ ఎంథూజియాస్ట్ అని హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టారు.
కాగా గత రెండేళ్లుగా పెద్దగా సినిమాల్లో కనిపించని రకుల్ ప్రీత్ సింగ్.. ఈ సంవత్సరం మాత్రం ఫుల్ బిజీగా గడపనున్నారు. ప్రస్తుతం రకుల్ తెలుగులో నితిన్ చెక్ చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళ్లో కమల్ హాసన్ ఇండియన్ 2, శివ కార్తికేయన్ అలయాన్లో నటిస్తున్నారు. వీటితో పాటు హిందీలో సర్దార్ అండ్ గ్రాండ్సన్, అటాక్, మేడే చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించిన ఓ మూవీలోనూ రకుల్ నటించారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.