హోమ్ /వార్తలు /సినిమా /

ఆ ఒక్క ఫోటో చాలు..రకుల్ స్టామినా ఎంటో తెలవడానికి..

ఆ ఒక్క ఫోటో చాలు..రకుల్ స్టామినా ఎంటో తెలవడానికి..

రకుల్ ప్రీత్ Photo: Instagram

రకుల్ ప్రీత్ Photo: Instagram

రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు తెలుగులో ఓ సంచలనం. తెలుగు సూపర్ స్టార్స్ అందరితో నటించి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.

  రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు తెలుగులో ఓ సంచలనం. తెలుగు సూపర్ స్టార్స్ అందరితో నటించి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అయితే ఆమె నటించిన సినిమాలు వరుసగా..బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతుండడంతో ఈ భామకు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో రకుల్ హిందీ బాట పట్టింది. అక్కడ అజయ్ దేవగన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమాలో నటిస్తోంది. సినిమా విడుదలకు సిద్దమైంది. మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందులో భాగంగా..ఆమె సినిమా ప్రమోషన్‌‌లో పాల్గోంటోంది. దీనికి సంబంధించి ఎప్పటికపుడు తన సోషల్ మీడియా ద్వారా సంగతుల్నీ ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ ఫోటోను ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేస్తూ.. తన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం 'దే దే ప్యార్ దే' సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా రెడీ అయ్యానని క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫోటోలో పర్పుల్ కలర్ టాప్‌తో అదే కలర్ ప్యాంట్ ధరించి సూపర్ స్టైలిష్‌గా పోజిచ్చింది. బ్రౌన్ షేడ్ ఉన్న హెయిర్.. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్‌తో పాటు.. చేతికి ఓ కత్తి లాంటీ గాజులు ధరించి..సూపర్ స్టైలిష్ మోడల్ లాగా దర్శనమిస్తోంది.


  రకుల్ ప్రీత్ Photo: Instagram


  దీంతో ఈ ఫోటోను నెటిజను తెగ ఇష్టపడుతున్నారు. ఈ ఫోటో పోస్ట్ చేసిన మూడు గంటల్లోనే మూడున్నర లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. దానికి తోడు వీపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్‌కు భార్యగా టబు నటిస్తుండగా..ప్రియురాలిగా రకుల్ చేస్తోంది. దీంతో..కాస్తా నాజుగ్గా ఉండాలనీ..దర్శకుడి సూచన మేరకు..10 కిలోల బరువు తగ్గింది. దీంతో ఈ సినిమా ప్రమోషన్‌లో కూడా సన్నగా..యమ నాజుగ్గా కనబడుతూ..కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. రకుల్ తెలుగులో నాగార్జున సరసన.. 'మన్మధుడు'కు సీక్వెల్‌గా వస్తోన్న 'మన్మధుడు 2'లో నటిస్తోంది.  First published:

  Tags: Ajay Devgn, Bollywood, Bollywood Movie, Bollywood news, Hindi Cinema, Manmadhudu 2, Nagarjuna Akkineni, Rakul, Rakul Preet Singh, Tabu, Tamil Cinema, Tamil Film News, Telugu Cinema, Telugu Cinema News, Telugu Movie

  ఉత్తమ కథలు