అయ్యో రకుల్‌కు ఏమైంది..ఎందుకు ఇలా మారిపోయింది..!

రకుల్ ప్రీత్ సింగ్ హిట్టు, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం.. ఆమె నాగార్జున హీరోగా నటిస్తున్న మన్మథుడు2 సినిమాలో నటిస్తున్నారు.

Suresh Rachamalla | news18-telugu
Updated: March 16, 2019, 7:57 AM IST
అయ్యో రకుల్‌కు ఏమైంది..ఎందుకు ఇలా మారిపోయింది..!
రకుల్ ప్రీత్ సింగ్ Photo: Instagram/rakulpreet
  • Share this:
రకుల్ ప్రీత్ సింగ్ హిట్టు, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం.. ఆమె నాగార్జున హీరోగా నటిస్తున్న మన్మథుడు2 సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ దర్శకుడు. నాగార్జునతో రకుల్ నటించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అటు తమిళంలో కుడా నటిస్తున్నారు. ఇటీవలే ఆమె కార్తీతో నటించిన ‘దేవ్‌’ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా  విడుదల అయ్యింది. ఈ సినమా పెద్దగా ఆడలేదు.  ఆ సినిమా ఫలితం ఎలా ఉన్న..ఆమె కార్తి అన్న.. సూర్యతో ‘ఎన్‌జీకే’ సినిమాను చేస్తోంది. ఈ సినిమా సమ్మర్‌ స్పెషల్‌గా రానుంది.  రకుల్ మరోపక్క.. హిందీలో అజయ్‌దేవ్‌గన్‌ చిత్రంలో నటిస్తుంది. ఇలా ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ యమ బీజీగా ఉంది.

సన్నగా మారిపోయిన రకుల్ Photo: Instagram/rakulpreet
సన్నగా మారిపోయిన రకుల్  Photo: Instagram/rakulpreet


అది అలా వుంటే..రకుల్ ఫిజిక్‌పై దృష్టి పెట్టింది. ఇటీవల తెరపై కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సైజ్ జీరో కోసం విపరీతంగా శ్రమించింది. దీంతో మరీ సన్నగా కనపడుతున్నది. తాజాగా రకుల్ తన ఫోటోలను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసింది..వాటిని చూసిన వారంతా..ఇదేంటీ రకుల్ ఇంతలా సన్నబడ్డారని..ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫోటోలో రకుల్.. నలుపురంగు బికినీ ధరించి ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే రకుల్‌ను అలా చూసిన నెటిజన్లు మాత్రం కాస్తంత బొద్దుగా ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.  మరోపక్క మరీ ఇంతలా సన్న బడటానికి కారణం ఎమైఉంటుందని..అభిమానుల్లో అందోళన మొదలైంది.

RRR హీరోయిన్ బర్త్‌డే స్పెషల్...రెడ్ కార్పెట్‌పై అందాల ఆలియా భట్ ఫోటోస్
First published: March 16, 2019, 7:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading