కష్టానికి ఫలితం లేకుండా పోతోంది: ఆవేదనలో రకుల్ ప్రీత్

రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య ఎదుర్కోంటున్న వరుస ఫేల్యూర్స్‌ గురించి స్పందిస్తూ.. కెమెరా ముందు కంటే వెనుకే మేము చాలా కష్టపడతాం. డైట్ విషయంలోనైతేనేం.. వ్యాయామం విషయంలోనూ చాలా కఠినంగా వ్యవహరిస్తాం. అయితే మేం పడే కష్టాలు ఎవరికి అవసరం లేదు. జయాపజయాలనే ఇక్కడ కొలమానంగా తీసుకుంటారంటూ తన భాదను చెప్పకొచ్చింది.

news18-telugu
Updated: June 14, 2019, 1:22 PM IST
కష్టానికి ఫలితం లేకుండా పోతోంది: ఆవేదనలో రకుల్ ప్రీత్
రకుల్ ప్రీత్ సింగ్ Photo: Instagram.com/rakulpreet
news18-telugu
Updated: June 14, 2019, 1:22 PM IST
రకుల్ ప్రీత్ సింగ్.. సినీ రంగంలోకి ప్రవేశించి దశాబ్దం కావొస్తున్నా ఈ భామ, ఇప్పటికీ అదే గ్లామర్‌ను మెయింటైన్ చేస్తూ.. సరైన డైట్ ఫాలో అవుతూ వస్తూ.. వ్యాయామం విషయంలోనూ కఠినంగా ఉంటూ, ఓ వైపు వయసు పెరుగుతున్నా.. రకుల్ అందం మాత్రం తగ్గడం లేదు. అయితే  ఒకప్పుడు తెలుగు, తమిళ భాషాల్లో వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న ఈ భామ..పరిస్థితి ప్రస్తుతం అంత ఏమీ బాగ లేదు. ఈ భామ ఆ మధ్య చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర డమాల్ అనడంతో అవకాశాలు తగ్గాయి. అయితే తెలుగు, తమిళ భాషాల్లో నిర్మితమైన మహేష్ హీరోగా వచ్చిన 'స్పైడర్' సినిమా పరాజయం తర్వాత మరీ దారుణమైపోయింది రకుల్ పరిస్థితి. దీంతో తెలుగులో రకుల్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ కారణం చేత గత సంవత్సర కాలంగా రకుల్ తమిళ, హిందీ చిత్ర పరిశ్రమ లోనే ఎక్కువ కాలం గడిపింది. 
Loading...

View this post on Instagram
 

The world will judge you on how you judge yourself so stand strong and chase those dreams ❤️ @sashajairam @im__sal @aliyashaik28


A post shared by Rakul Singh (@rakulpreet) on

అయితే రకుల్ ఎదుర్కోంటున్న వరుస ఫేల్యూర్స్‌ గురించి స్పందిస్తూ.. కెమెరా ముందు కంటే వెనుకే మేము చాలా కష్టపడతాం. డైట్ విషయంలోనైతేనేం.. వ్యాయామం విషయంలోనూ చాలా కఠినంగా వ్యవహరిస్తాం.. నేనే కాదు అందరు హీరోయిన్స్ అలాగే ఉంటారు. అయితే మేం పడే కష్టాలు మిగతా వారికి అనవసరం. జయాపజయాలనే ఇక్కడ కొలమానంగా తీసుకుంటారు. ఎంత కష్టపడి సినిమా చేసినా కొన్ని సార్లు ఫలితం దక్కుతుంది.. కొన్ని సార్లు దక్కదని వాపోయారు రకుల్. అయితే ప్రస్తుతం రకుల్ నాగార్జున హీరోగా వస్తోన్న మన్మథుడు 2లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా 'మనం', 'ఇష్క్', '24' సినిమాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తోన్న 'గ్యాంగ్ లీడర్' సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కోసం రకుల్‌ను సంప్రదించినట్లు సమాచారం.
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...