Home /News /movies /

ACTRESS RADHIKA AND KUSHBOO FIDHA ON SHARWANAND BEHAVIOR AT AADAVALLU MEEKU JOHAARLU SHOOTING SPOT NR

Sharwanand - Radhika - Kushboo: శర్వానంద్ సింప్లిసిటీకి ఫిదా అయిన ఖుష్బూ, రాధిక.. ఏం చేశాడంటే?

Sharwanand - Radhika - Kushboo: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్నో విభిన్న కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను సందడి చేసిన శర్వానంద్ చివరిగా "శ్రీకారం"

Sharwanand - Radhika - Kushboo: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్నో విభిన్న కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను సందడి చేసిన శర్వానంద్ చివరిగా "శ్రీకారం"

Sharwanand - Radhika - Kushboo: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్నో విభిన్న కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను సందడి చేసిన శర్వానంద్ చివరిగా "శ్రీకారం"

    Sharwanand - Radhika - Kushboo: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్నో విభిన్న కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను సందడి చేసిన శర్వానంద్ చివరిగా "శ్రీకారం" సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన శ్రీకారం సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. థియేటర్ లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయినప్పటికీ ఓటీటీ విడుదలై మంచి ఆదరణ పొందిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం "ఒకే ఒక జీవితం", "ఆడాళ్లు మీకు జోహార్లు","మహా సముద్రం" వంటి సినిమాలలో నటిస్తున్నారు.

    శర్వానంద్ నటిస్తున్న ఈ సినిమాలో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించింది. కరోనా రాకముందు షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా కరోనా కారణంచేత షూటింగ్ వాయిదా వేసుకుంది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడం చేత ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ రష్మిక కూడా భాగమయ్యారు.

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఫ్యామిలీ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సెట్లో సీనియర్ నటీమణులు రాధిక, ఊర్వశి, కుష్బూ సందడి చేశారు. ఇక షూటింగ్ విధానంలో భాగంగా హీరో శర్వానంద్ తన ఇంటి నుంచి తీసుకువచ్చిన భోజనాన్ని అక్కడ ఉన్నటువంటి సీనియర్ నటీమణులకు ఎంతో పద్ధతిగా స్వయంగా వడ్డించారు. ఈ విధంగా శర్వానంద్ భోజనం వడ్డించడంతో సీనియర్ నటీమణులు కుష్బూ అతని సింప్లిసిటీ కి ఫిదా అయ్యారు.

    ఈ సందర్భంగా నటి రాధిక మాట్లాడుతూ.. ఈ విధంగా సినిమా సెట్లో హీరో స్వయంగా భోజనం తీసుకువచ్చి వడ్డిస్తుంటే షూటింగు ఎప్పుడు సరదాగా ఉంటాయని రాధిక పేర్కొన్నారు. ఈ విధంగా సెట్ లో శర్వానంద్ సింప్లిసిటీ చూసి సీనియర్ తారలు తెగ సంబరపడిపోయారు. ఇక శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాకు సంబంధించిన సమాచారాన్ని చిత్రబృందం విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా శర్వానంద్ హీరో సిద్ధార్థ తో కలిసి మహా సముద్రం సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Aadavallu meeku johaarlu, Actress kushboo, Actress Radhika, Sharwanand

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు