మెగా అగ్ర హీరో సరసన నటించే చాన్స్ కొట్టేసిన రాశీ ఖన్నా...

రాశీ ఖన్నా.. అల్లు అర్జున్‌ సరసన నటించే అవకాశం కొట్టేసిందని తెలుస్తోంది. MCA దర్శకుడు వేణు శ్రీరామ్‌, మెగా హీరో అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ‘ఐకాన్‌’ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

news18-telugu
Updated: July 13, 2019, 7:26 PM IST
మెగా అగ్ర హీరో సరసన నటించే చాన్స్ కొట్టేసిన రాశీ ఖన్నా...
రాశీ ఖన్నా Photo : Instagram
  • Share this:
రాశీ ఖన్నా..‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయకగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఈ భామ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో.. తెలుగులో అవకాశాలు సన్నగిల్లిన.. తర్వాత పుంజుకున్నాయి. అయితే తాజగా రాశీ ఖన్నా..  అల్లు అర్జున్‌ సరసన నటించే అవకాశం కొట్టేసిందని తెలుస్తోంది. MCA దర్శకుడు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా‘ఐకాన్‌’ అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. బన్ని హీరోగా, దిల్ రాజు నిర్మాతగా ఇప్పటికే.. వీరిద్దరి కాంబినేషన్‌‌లో ‘ఆర్య’, ‘పరుగు’, ‘డీజే’ సిినిమాలు వచ్చాయి. ఆ తర్వాత తాజాగా దిల్‌రాజు, బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో సినిమా 'ఐకాన్'. ఈ సినిమాలో  హీరోయిన్‌గా రాశీని పరీశీలిస్తున్నారని సినీ వర్గాల టాక్. 
Loading...

View this post on Instagram
 

The art of eye contact 😉


A post shared by Raashi Khanna (@raashikhannaoffl) on

అందులో భాగంగా దర్శకుడు రాశీ ఖన్నాకు కథను వినిపించడం.. స్క్రిప్టు ఆమెకు నచ్చండంతో, రాశీ ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపారని తెలుస్తోంది. అంతేకాదు ‘ఐకాన్‌’ సినిమాకు ఆమె కావాల్సినన్ని డేట్స్‌ కూడా సమాకూర్చినట్లు సమాచారం. రాశీ ఈ సినిమా కాకుండా తెలుగులో.. మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ప్రతి రోజు పండగే’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో  సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా చేస్తున్నాడు. మరోపక్కరాశీ ఖన్నా, వెంకటేశ్‌, నాగచైతన్యల కాంబినేషన్‌లో వస్తున్న ‘వెంకీ మామ’ లోనూ నటిస్తోంది.
First published: July 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...