• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ACTRESS PRIYNAKA CHOPRA REVEALS SHE DIDNT TAKE NICK MESSAGES SERIOUSLY EARLIER MNJ GH

Priyanka Chopra- Nick Jonas: మొదట్లో నిక్ ని చూసి అలా అనుకున్నాను.. ఆ తర్వాత అభిప్రాయం మార్చుకున్నా అంటోన్న ప్రియాంక..

Priyanka Chopra- Nick Jonas: మొదట్లో నిక్ ని చూసి అలా అనుకున్నాను.. ఆ తర్వాత అభిప్రాయం మార్చుకున్నా అంటోన్న ప్రియాంక..

Priyanka Nick Jonas

Priyanka Chopra- Nick Jonas: ప్రియాంక చోప్రా.. హాలీవుడ్, బాలీవుడ్ సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు తనది. బాలివుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకుంటూ గ్లోబల్ స్థాయి నటిగా మన్ననలు అందుకుంటోంది. ముఖ్యంగా ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ తో వివాహం తర్వాత ఈ జంట చాలాసార్లు వార్తల్లో నిలిచింది

  • Share this:
Priyanka Chopra- Nick Jonas: ప్రియాంక చోప్రా.. హాలీవుడ్, బాలీవుడ్ సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు తనది. బాలివుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకుంటూ గ్లోబల్ స్థాయి నటిగా మన్ననలు అందుకుంటోంది. ముఖ్యంగా ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ తో వివాహం తర్వాత ఈ జంట చాలాసార్లు వార్తల్లో నిలిచింది. తాజాగా ప్రియాంక ప్రముఖ అమెరికా వ్యాఖ్యాత ఓప్రా విన్ ఫ్రేతో ముచ్చటించింది. మార్చి 20న డిస్కవరీ ప్లస్ లో ప్రసారం కానున్న సూపర్ సౌల్ సిరీస్ షో కోసం ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా తన గురించి, భర్త నిక్ జోనాస్, అతడితో ప్రేమ, పెళ్లి లాంటి ఆసక్తికర విషయాలను తెలిపింది ప్రియాంక. ముఖ్యంగా నిక్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడనే విషయాన్ని పంచుకుంది.

ఇటీవలే ప్రియాంక చోప్రా త‌న ఆటోబయోగ్రఫీ 'అన్‌ఫినిష్డ్' పుస్త‌కాన్ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. మార్కెట్‌లో విడుద‌లైన వారంలోపే ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్స్ లిస్ట్‌లో చేరి.. లెక్కలేనన్ని కాపీలు అమ్ముడుపోయింది. నిక్ తో పెళ్లి విషయంలో తన తల్లి అయిన మధు చోప్రా ఎంతో కీలక పాత్ర పోషించిందని ఈ పుస్తకంలో ప్రియాంక తెలిపింది. ఈ విషయం గురించి ఓప్రా ఆమెను అడగ్గా ఈ విధంగా బదులిచ్చింది.
"ఎవరి గురించీ పూర్తిగా తెలియకుండా వారిపై ఓ అంచనాకి రాకూడదని చాలామంది చెబుతుంటారు. కానీ మొదట్లో నేను అలాగే చేశాననుకుంటా. మొదట్లో నేను అతడిని(నిక్) అంతగా సీరియస్ తీసుకోలేదు. అతడు ఛాటింగ్ చేయడం ప్రారంభించినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. నాకేమో 35 ఏళ్లు. పెళ్లిచేసుకోవాలి, పిల్లలను కనాలనే ఆలోచనలో ఉన్నాను. అతడికి 25 ఏళ్లు కూడా ఉండవని మీకు తెలుసు. కొంతకాలం అలాగే దూరంగా ఉన్నాను. కానీ అతడితో కలిసి బయటకు వెళ్లిన తర్వాత నిక్ ను చూసి ఆశ్చర్యమేసింది. నిక్ కు ఆత్మవిశ్వాసం ఎక్కువ. చాలా తెలివైనవాడు. నా విజయాలు, కలల గురించి తెలుసుకుంటూ ఎంతో ఆదరణ చూపేవాడు. అలా కొన్నాళ్లు తనతో గడిపాక సరైన భాగస్వామి దొరికాడని అనిపించింది. మేము కలిసి చేసే ప్రతి పనిలోనూ అతడు మద్దతుగా నిలిచాడు. మా అమ్మ అతడిని నా కోసమే తీసుకొచ్చినట్లు అనిపించింది" అని ప్రియాంక తన శ్రీవారి గురించి వివరించింది. "వివాహానికి అమ్మ ఎంతో విలువనిచ్చింది. నా పెళ్లిలోనూ అంతే ఉత్సాహం చూపింది. ఎందుకంటే వారిద్దరూ(ప్రియాంక తల్లిదండ్రులు) పరిపూర్ణ భాగస్వాములు. కలిసి జీవించారు. ఇద్దరు కలిసి అందమైన ఇంటిని నిర్మించుకున్నారు. కష్టసుఖాలను పంచుకున్నారు. సమమైన భాగస్వామ్యమంటే ఏంటో వారిని చూస్తూ పెరిగిన నాకు అప్పుడే తెలిసింది. నాకూ అలాంటి అద్భుతమైన భాగస్వామే దొరికినందుకు ఎంతో ఆనందంగా ఉంది" అని ప్రియాంక తెలిపింది.
First published: