షాకింగ్.. వేశ్యగా ప్రియాంక చోప్రా..

గతేడాది ‘పద్మావత్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న భన్సాలీ...తాజాగా సల్మాన్ ఖాన్,ఆలియాభట్‌‌లతో ‘ఇన్‌షా అల్లా’ అనే పేరుతో ఒక సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసాడు.త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాతో పాటు సంజయ్ లీలా భన్సాలీ..మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: March 23, 2019, 7:53 PM IST
షాకింగ్.. వేశ్యగా ప్రియాంక చోప్రా..
ప్రియాంకాచోప్రా
  • Share this:
గతేడాది ‘పద్మావత్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న భన్సాలీ...తాజాగా సల్మాన్ ఖాన్,ఆలియాభట్‌‌లతో ‘ఇన్‌షా అల్లా’ అనే పేరుతో ఒక సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసాడు.త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాతో పాటు సంజయ్ లీలా భన్సాలీ..మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ముంబాయికి చెందిన రౌడీరాణి గుంగూబాయి కోఠేవాలి జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందకు సంజయ్ లీలా భన్సాలీ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను ముంబాయిలోని కామటిపుర అనే రెడ్ లైట్ ఏరియా బ్యాక్ డ్రాప్‌లో  తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా వేశ్యావాటిక నిర్వాహకురాలు గుంగూబాయిగా నటించబోతుంది. ఈ సినిమాకు ‘గంగుబాయి’ టైటిల్ తో పాటు ‘హీరా మండి’ అనే  టైటిల్ ను అనుకుంటున్నారు. కామాటిపుర ప్రాంతానికి చెందిన గంగూబాయి అంటే అక్కడివారు వణికిపోయేవారు. అంతేకాదు ఆమెను ‘మేడమ్ ఆఫ్ కామాటిపుర’గా పిలిచేవారు. చిన్నతనంలో తనకు తెలియకుండా వ్యభిచార కూపంలో కూరుకు పోయిన ఆమె... ఆ తర్వాత రౌడీరాణిగా ఎదిగింది. ముంబాయిలో ఆమె నడిపిన వ్యభిచార గృహాల గురించి ఈ మూవీలో చూపించబోతున్నారు.

గతేడాది ‘పద్మావత్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న భన్సాలీ...తాజాగా సల్మాన్ ఖాన్,ఆలియాభట్‌‌లతో ‘ఇన్‌షా అల్లా’ అనే పేరుతో ఒక సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసాడు.త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాతో పాటు సంజయ్ లీలా భన్సాలీ..మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
ప్రియాంక చోప్రా, సంజయ్ లీలా భన్సాలీ


మొత్తానికి ఒకేసారి సల్మాన్ ఖాన్ ‘ఇన్ షా అల్లా’ మూవీతో పాటు ప్రియాంక చోప్రా మూవీతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సందడి చేయబోతున్నాడు.

  
First published: March 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు