Priya Bhavani Shankar: కోలీవుడ్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో ప్రియా భవాని శంకర్ ఒకరు. మేయధ మాన్ మూవీ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియా భవానీ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే.. పదేళ్లుగా ఈ నటి రాజావేల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అతడి కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తూ తమ రిలేషన్‌ని కొనసాగిస్తూ వస్తోంది ప్రియా. ఇక ఇటీవల రాజావేల్ పుట్టినరోజు కాగా.. అతడి కోసం తన సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్‌ని పెట్టారు ప్రియా. 2011లో రాజావేల్తో తీసుకున్న ఫొటోను 2021లో అతడితో కలిసి ఉన్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ నటి.
దానికి 2011, 2021. రాజావేల్ పదేళ్లుగా ఎన్నో మార్పులు రాగా.. నీ పుట్టినరోజు కోసం ఏం దాచి ఉంచానో చూడు. ఇన్నేళ్లుగా మారిపోనిది మన బంధం ఒక్కటే. ఈ ప్రపంచంలో బెస్ట్ నీకు రావాలి. ఇలానే మన ప్రేమ కొనసాగాలి. డ్యాన్సర్, సింగర్, గిటారిస్ట్, రొటేటర్, రాక్‌స్టార్ హ్యాపీ బర్త్‌డే మా అని కామెంట్ పెట్టారు ప్రియా.
ఇక కెరీర్ పరంగా ప్రియా చాలా బిజీగా గడిపేస్తుంది. ఆమె నటించిన కలథిల్ శాంతిపోమ్, బొమ్మై, కురుతి ఆటమ్, ఓ మన పెన్నె విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ప్రస్తుతం ఇండియన్ 2, పాతు తాల మూవీలతో పాటు అరుణ్ విజయ్ హీరోగా హరి తెరకెక్కిస్తోన్న చిత్రంలోనూ ప్రియా నటించబోతోంది.