ACTRESS POONAM KAUR SENSATIONAL TWEET OVER THE FAN WER BETWEEN MEERA CHOPRA AND JR NTR PK
స్వలాభం కోసం ఫ్యాన్ వార్.. ఎన్టీఆర్, మీరా గొడవపై పూనమ్ కౌర్ ట్వీట్..
పూనమ్ కౌర్ ఎన్టీఆర్ (Poonam Kaur Jr NTR)
Poonam Kaur: నాలుగు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వ్యవహారం. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదన్న పాపానికి మీరా చోప్రాతో ఆడుకున్నారు అభిమానులు.
నాలుగు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వ్యవహారం. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదన్న పాపానికి మీరా చోప్రాతో ఆడుకున్నారు అభిమానులు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ కొందరు మాత్రం కావాలనే మీరాను అసభ్యంగా మాట్లాడారు.. ఆమెతో అసభ్యకరమైన పదజాలం వాడారు. దాంతో ఆమె ఇష్యూను సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి అభిమానులతో ఎన్టీఆర్ ఎలా సూపర్ స్టార్ అయ్యాడో తెలియదంటూ అటాక్ మొదలు పెట్టింది. చివరికి ఇష్యూ తెలంగాణ మంత్రి కేటీఆర్ వరకు కూడా వెళ్లింది. కల్వకుంట్ల కవితకు ఫిర్యాదు చేసి ఈ వివాదాన్ని మీరా మరింత జఠిలంగా మారుస్తుంది.
మంత్రి కేటీఆర్, నటి మీరా చోప్రా (ktr meera chopra)
ఏపీ ప్రభుత్వాన్ని కూడా కలగజేసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా వుంటే ఈ వివాదంపై ఇప్పుడు నటి పూనమ్ కౌర్ కూడా స్పందించింది. ఫ్యాన్స్ నుంచి ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో ఈమెకు కూడా తెలుసు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను విమర్శించినపుడు ఆయన ఫ్యాన్స్ ఈమెతో ఆడుకున్నారు.. దారుణంగా ట్రోల్ చేసారు. అప్పుడు పూనమ్ కూడా కాస్త అసహనానికి లోనైంది. అయితే అందరు అభిమానులు అలా ఉండరని చెబుతుంది ఈమె.
No actor wants his fans to abuse any one , it’s created by jealous factors in and around the industry n media . They don’t have time for this . Trolling is a part of actors life . Criminal acts needs to be reported . Trolling is a game done to victimse u .dont bother .move on!
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 5, 2020
అప్పట్లో పూనమ్ కూడా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్ తప్పేం లేదన్నట్లు మాట్లాడుతుంది ఈమె. ఈ వివాదంలో అనవసరంగా ఫ్యాన్స్‌ని బ్లేమ్ చేయొద్దని.. వాళ్లు అమాయకులని.. వాళ్లను కావాలనే కొందరు స్వలాభం కోసం వాడుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎటువంటి కారణం లేకుండా తన పేరు ఈ వివాదంలోకి లాగినా కూడా తను అభిమానులపై కోపంగా లేనని.. వాళ్లపై ఫిర్యాదు కూడా చేయలేదని ట్వీట్ చేసింది పూనమ్ కౌర్.
We don’t even know if these fans are fake accounts created by political gains and at the end the actor gets blamed no matter who it is .... accept that our industry is interlinked with one political party each .fans are innocent people ,few political people are evil .they do this
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 5, 2020
ఇప్పటికీ వాళ్లు అమాయకులనే అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది ఈమె. కొందరు మధ్యలో ఉండి తమ స్వలాభం కోసం అభిమానులను దారుణంగా వాడుకుంటున్నారు.. గతంలో తనను బాధపెట్టిన వ్యక్తులపై మాత్రమే ఫిర్యాదు చేసాను కానీ అందరిపై కాదని గుర్తు చేసింది పూనమ్. ఏదేమైనా కూడా ఫ్యాన్స్ అమాయకులంటూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.