Home /News /movies /

ACTRESS POONAM KAUR SENSATIONAL LETTER ON A STAR DIRECTOR IN TOLLYWOOD PK

నువ్వు చస్తే ఒక్కరోజు న్యూస్ అవుతాదన్నాడు.. అగ్ర దర్శకుడిపై పూనమ్ కౌర్ సంచలనం..

పూనమ్ కౌర్ (Source: Twitter)

పూనమ్ కౌర్ (Source: Twitter)

Poonam Kaur: చేసిన సినిమాలు తక్కువ.. వివాదాలు ఎక్కువ.. ఈ మాటకు పూనమ్ కౌర్ పక్కా నిదర్శనంగా నిలుస్తుంది. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా కూడా ఎప్పుడూ కాంట్రవర్సీల్లోనే ఉంటుంది ఈమె.

చేసిన సినిమాలు తక్కువ.. వివాదాలు ఎక్కువ.. ఈ మాటకు పూనమ్ కౌర్ పక్కా నిదర్శనంగా నిలుస్తుంది. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా కూడా ఎప్పుడూ కాంట్రవర్సీల్లోనే ఉంటుంది ఈమె. ఇప్పుడు మరోసారి ఈ ముద్దుగుమ్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సారి ఏకంగా ఓ స్టార్ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆమె గుర్తు చేసుకుంది. దానికి సంబంధించిన లేఖ రాసింది.
పూనమ్ కౌర్ (Source: Twitter)
పూనమ్ కౌర్ (Source: Twitter)

అందులో ఇలా రాసుకొచ్చింది పూనమ్.. కొన్ని రోజులుగా తన మానసిక పరిస్థితి బాగాలేదని.. ఏం చేయాలో అర్థం కావడం లేదని.. ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పుకొచ్చింది పూనమ్. అందుకే ఓ దర్శకుడి దగ్గరికి వెళ్లి తన దగ్గర కాసేపు మాట్లాడండి.. తన పరిస్థితి ఇలా ఉందని చెప్పుకున్నట్లు రాసుకొచ్చింది పూనమ్. అయితే తను మాత్రం పట్టించుకోనట్లే ఉన్నాడని.. పైగా నువ్వు చనిపోతే ఒక్క రోజు న్యూస్‌ అవుతావ్‌ అని ఆ దర్శకుడు ఎగతాళిగా అన్నాడని గుర్తు చేసుకుంది పూనమ్.
పూనమ్ కౌర్ (Source: Twitter)
పూనమ్ కౌర్ (Source: Twitter)

ఆ మాటలు విన్న తర్వాత తనకు విరక్తి వచ్చేసిందని చెప్పింది ఈమె. ప్రస్తుతం ఆ దర్శకుడు ఎన్నో రంగాల్ని కంట్రోల్‌ చేస్తున్నాడని.. మీడియా రాసిన కొన్ని చెత్త ఆర్టికల్స్‌తో తన మనసుకు గాయం అయిందని చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్. అందుకే తానే నేరుగా అతడికి సమాధానం ఇచ్చానని.. తానెందుకు ఇలా ఉండాలి అనుకుని ప్రస్తుతం మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది పూనమ్. నీ పలుకుబడి ఉపయోగించి.. నువ్వు నన్ను సినిమాల నుంచి నిషేధించావు.. కానీ ఫర్వాలేదు.. నువ్వు గురూజీవి కాదు.. స్వలాభం కోసం నీ స్నేహితుల్ని కూడా మోసం చేస్తూ వాళ్లను మభ్య పెడుతూ బతుకుతున్నావంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
పూనమ్ కౌర్ లెటర్ (poonam kaur letter)
పూనమ్ కౌర్ లెటర్ (poonam kaur letter)

నీ వల్ల లాభం పొందిన వాళ్లు నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరూ లేరంటూ ఫైర్ అయిపోయింది పూనమ్. ముందు తాను కూడా ఆ దర్శకుడిని మంచి వాడనే అనుకున్నానని.. కానీ ఆయన అసలు రంగు చూసిన తర్వాత షాక్ అయిపోయానని చెప్పుకొచ్చింది. అంతెందుకు తన ప్రాణ స్నేహితుడు అని చెప్పుకునే ఓ స్టార్ హీరోను, అతడి భార్యను కూడా విడగొట్టింది ఈయనే అంటూ మరో వార్త కూడా రాసుకొచ్చింది పూనమ్. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌లా తాను ఫీల్‌ అయ్యేలా చేస్తున్నాడని.. కానీ తన జీవితం మాత్రం అలా ముగించనని చెప్తుంది పూనమ్. ఇంత పెద్ద లెటర్ రాసినా కూడా ఆ గురూజీ ఎవరో మాత్రం బయటపెట్టలేదు పూనమ్ కౌర్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Poonam kaur, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు