Home /News /movies /

ACTRESS POONAM KAUR ONCE AGAIN SENSATIONAL TWEET ON THAT PARTICULAR STAR DIRECTOR PK

మూడు పెళ్లిళ్లు.. ఆ సన్నాసి వల్ల జీవితం నాశనం.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్..

పూనమ్ కౌర్ (Poonam Kaur: Twitter)

పూనమ్ కౌర్ (Poonam Kaur: Twitter)

Poonam Kaur: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న తర్వాత చాలా మంది సెలబ్రిటీస్ కూడా తమ జీవితంలో జరిగిన ఇలాంటి సంఘటనల గురించి మాట్లాడుతున్నారు.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న తర్వాత చాలా మంది సెలబ్రిటీస్ కూడా తమ జీవితంలో జరిగిన ఇలాంటి సంఘటనల గురించి మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు అయితే ఏకంగా తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని.. కానీ ధైర్యంతో నిలబడి పోరాడి గెలిచామని చెప్తున్నారు. కానీ సుశాంత్ మాత్రం అలా చేయలేకపోయాడు పాపం అంటూ రాసుకొచ్చారు. ఇదే విషయంపై కొన్ని రోజుల కింద హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా సంచలన ట్వీట్ చేసింది.

పూనమ్ కౌర్ (Poonam Kaur: Twitter)
పూనమ్ కౌర్ (Poonam Kaur: Twitter)


తన జీవితంలో కూడా ఓ స్టార్ డైరెక్టర్ కారణంగా చాలా డిప్రెషన్‌కు లోనయ్యానని.. ఆయన తనను చాలా నాశనం చేసాడని చెప్పుకొచ్చింది. తన స్నేహితుడి జీవితాన్ని కూడా నాశనం చేసాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతా ఆయన్ని గురూజీ అంటారు కానీ ఆయన గురూజి కాడని ట్వీట్ చేసింది పూనమ్. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. అందులో భాగంగా ఓ నెటిజన్ మీరు లీగల్‌గా ఎందుకు పోరాడలేదని.. పోరాడాలి కదా అంటూ సలహా ఇచ్చాడు.
పూనమ్ కౌర్ (Poonam Kaur: Twitter)
పూనమ్ కౌర్ (Poonam Kaur: Twitter)

దీంతో పూనమ్ ఘాటుగా రిప్లై అయింది. ఈ విషయం మీ అన్నయ్య చెప్పాడా.. ఆయన ఓడిపోతే హ్యాపీగా ఉందా.. ఆయన అవమానపడితే మీకు ఆనందమా.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని అవమానిస్తుంటే మీకు హాయిగా ఉంటుందా అంటూ ప్రశ్నించింది. సదరు దర్శకుడు ఆయన జీవితంతో పాటు తన జీవితం కూడా నాశనం చేసాడని.. కేవలం ఓ సన్నాసి వల్ల మీ అన్నయ్య జీవితం కూడా పాడైపోతుందని ట్వీట్ చేసింది.
First published:

Tags: Poonam kaur, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు