Home /News /movies /

ACTRESS POONAM KAUR MEET MP SHASHI THAROOR WITH LAW STUDENTS SB

Poonam Kaur: కాంగ్రెస్ ఎంపీని కలిసిన టాలీవుడ్ నటి

ఎంపీ శశిథరూర్‌ను కలిసిన పూనమ్ కౌర్

ఎంపీ శశిథరూర్‌ను కలిసిన పూనమ్ కౌర్

ఈ సమావేశం తర్వాత పూనమ్‌ను కలవడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. అటు పూనమ్ కూడా ఎంపీకి ధన్యావాదాలు తెలిపారు.

    టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్( Poonam Kaur)  తాజాగా కాంగ్రెస్ ఎంపీని కలిసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌తో  ( mp shashi tharoor ) ఆమె భేటీ అయ్యింది. ఏపీలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ వ్యవహరిస్తోంది. దీంతో ఆమె తనదైన రీతిలో చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తోంది. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఆమె కొంతమంది లా విద్యార్థులతో కలిసి కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ తో భేటీ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది పూనమ్ కౌర్.

    కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌( congress mp shashi tharoor )కు తమకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది పూనమ్. గతంలో కూడా పూనమ్‌ కష్టాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న చేనేత కార్మికులకు అండగా ఉండాలని, జీఎస్‌టీని పూర్తిగా ఎత్తివేయాలని ప్రధానిని కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన డిమాండ్ కు ప్రముఖుల నుంచి సపోర్ట్ ను అందుకునే పనిలో పడింది ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ.


    ఈ సమావేశంలో చేనేతకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చర్చించారు. ఇక పూనమ్ కౌర్ తో పాటు పలువురు విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందంటూ శశి థరూర్ భేటీకి సంబంధించిన కొన్ని ఫోటోలను ట్వీట్ చేశారు. 'చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేస్తున్న న్యాయ విద్యార్థుల బృందాన్ని, పూనమ్‌ కౌర్‌(Poonam Kaur)ను కలవడం సంతోషంగా ఉంది. వారి డిమాండ్‌కు నేను సపోర్ట్ చేస్తున్నాను. పరిశ్రమ సంక్షోభంలో ఉంది. చేనేత కార్మికులు చాలా కష్టపడతారు. పైగా జీఎస్టీ వల్ల ఖర్చు పెరిగి వారిపై అదనపు భారం పడుతోంది' అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు.

    ఇక పూనమ్ కౌర్ పలు తెలుగు సినిమాల్లో నటించారు. అయితే గత కొంత కాలంగా ఆమె ఏ సినిమాల్లో నటించలేదు. పూనమ్ పంజాబీ అమ్మాయి. పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే.2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం తో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. అటు తరువాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్ మొదలైన చిత్రాలలో నటించింది.2018లో త్రిదేవ్ అనే హిందీ సినిమాలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత పూనమ్ సినిమాల్లో నటించలేదు.
    Published by:Sultana Shaik
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు