పూనమ్ కౌర్..ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన మాయాజాలం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తర్వాత..అడపా దడపా పలు సినిమాల్లో నటించింది. కానీ ఏ సీనిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. దీంతో హీరోయిన్ పాత్రల్నీ వదిలి..హీరోలకు చెల్లెలి పాత్రల్నీ వేయడం ఆరంభించింది. అలా గోపిచంద్ శౌర్యంలో హీరోకు చెల్లిగా చేసింది. అంతేకాకుండా పూనమ్ కౌర్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే..కన్నడ, తమిళ సినిమాలు చేసింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో ఆమె సినిమాలు ఏవి పెద్దగా రావడం లేదు. అయితే ఆమె తన సినిమాల కంటే..ఆమె చుట్టూ అల్లుకున్న వివాదాల ద్వారా పాపులర్ అయ్యింది. ఆ మద్య పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ , కత్తి మహేష్‌ల మద్య జరిగిన గొడవలు లేదా దూషణ పర్వంలో పూనమ్ పేరును భాగానే గర్తు చేశాడు..కత్తి మహేష్. ఆయన పలు సందర్బాల్లో పూనమ్ కౌర్, పవన్ కళ్యాన్‌ను టార్గెట్ చేసుకోని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
నటి పూనమ్ కౌర్..Photo: Instagram
తాజాగా పూనమ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి..తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులు కి ఫిర్యాదు చేసింది. తనపై యూట్యూబ్‌లో ఉద్దేశపూర్వకంగానే అసభ్యకరమైన పోస్టింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. కొంతమంది వ్యక్తులు కావాలనే.. తనను కించపరిచే విధంగా పోస్టింగులు పెడుతూ,తన వ్యక్తిత్వాన్ని వారిపోస్టులతో దిగజార్చుతున్నారని ఆరోపించింది. తనకు ఇంత పరువు నష్టాన్ని కల్గిస్తున్న.. యూట్యూబ్ లింకులు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను కోరింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.