బాలీవుడ్ ప్రముఖ నటి అరెస్ట్.. రాజస్తాన్‌కు తరలింపు..

బాలీవుడ్ నటి పాయల్ రోహత్గిని రాజస్తాన్ పోలీసులు అహ్మదాబాద్‌లో అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: December 16, 2019, 12:04 PM IST
బాలీవుడ్ ప్రముఖ నటి అరెస్ట్.. రాజస్తాన్‌కు తరలింపు..
పాయల్ రోహత్గీ (File Photo)
  • Share this:
బాలీవుడ్ నటి పాయల్ రోహత్గిని రాజస్తాన్ పోలీసులు అహ్మదాబాద్‌లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం రాజస్తాన్‌కు తరలించారు. నెహ్రూ-గాంధీ కుటుంబాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఐటీ యాక్ట్ కింద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రాజస్తాన్ యువజన కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు కాగా.. ఈ నెల ఆరంభంలో పాయల్‌కు నోటీసులు జారీ చేశారు. ఆమె వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పాయల్‌ను విచారణ కోసం మాత్రమే అదుపులోకి తీసుకున్నామని.. అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

ఈ నేపథ్యంలో పాయల్ రోహత్గి ఇప్పటికే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గూగుల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా నెహ్రూ కుటుంబంపై వీడియో చేసినందుకు అరెస్ట్ చేసినట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్చ అపహాస్యం అయిపోయిందని పేర్కొన్నారు.
Published by: Srinivas Mittapalli
First published: December 16, 2019, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading