ఆ కేసులో పాయల్‌కు బెయిల్ నిరాకరణ..

కొన్నేళ్ల క్రితం నెహ్రూ గాంధీ కుటుంబాలను కించపరిచేలా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టులు పెట్టినందకు నటి పాయల్‌ను రాజస్థాన్ పోలీసులు ఆమెను ఐటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. 

news18-telugu
Updated: December 16, 2019, 8:43 PM IST
ఆ కేసులో పాయల్‌కు బెయిల్ నిరాకరణ..
ఇబ్బందుల పాలైన హీరోయిన్ ప్రతీతాత్మక చిత్రం (Twitter/Photo)
  • Share this:
కొన్నేళ్ల క్రితం నెహ్రూ గాంధీ కుటుంబాలను కించపరిచేలా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టులు పెట్టినందకు నటి పాయల్‌ను రాజస్థాన్ పోలీసులు ఆమెను ఐటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. రాజస్తాన్ యువజన కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఆమె వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే  ఆమెను  అరెస్ట్ చేసారు. ఈ కేసులో బాలీవుడ్ నటికి పాయల్ రోహత్గీకి న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. దీంతో డిసెంబర్ 24 వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

actress payal rohatgi detained for comments against nehru gandhi family
పాయల్ రోహత్గీ (File Photo)


ఐతే.. పాయల్ ఈ  ఆదివారం ట్విట్టర్‌లో  ఓ పోస్ట్ చేసారు. నెహ్రూ గురించి గూగుల్‌లో లభించిన సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టు మాట్లాడినందుకు రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. మన దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా జోక్ అయిపోయిందంటూ కామెంట్ చేసింది. మరోపక్క కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పాయల్ కేసుపై స్పందించారు. పాయల్ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఈ విషయమై ఆమె అరెస్ట్ చేయడం సరైంది కాదని అభిప్రాయ పడ్డారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 16, 2019, 8:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading