బాలకృష్ణతో పాయల్ రాజ్‌పుత్.. అంత ఉత్తదేనా..

పాయల్ రాజ్‌పుత్.. ఈ భామ ఇప్పుడో సంచలనం. ఆర్ ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ తర్వాత ఈ అమ్మడుకు విపరీతంగా ఆఫర్స్ వస్తున్నాయి.

news18-telugu
Updated: May 17, 2019, 3:43 PM IST
బాలకృష్ణతో పాయల్ రాజ్‌పుత్.. అంత ఉత్తదేనా..
బాలక‌ృష్ణ, పాయల్ రాజ్‌పుత్
  • Share this:
పాయల్ రాజ్‌పుత్.. ఈ భామ ఇప్పుడో సంచలనం. ఆర్ ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ తర్వాత ఈ అమ్మడుకు విపరీతంగా ఆఫర్స్ వస్తున్నాయి. అందులో భాగంగా..వరుసగా సినిమాలను చేస్తూ పెద్ద పెద్ద హీరోల సరసన నటిస్తోంది. దీంతో పాయల్ డేట్స్ ‌కోసం టాప్ హీరోలు సైతం లైన్లో వెయిట్ చేస్తున్నారని.. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతోంది. బాలయ్య , నాగార్జున,వెంకటేష్ వంటి టాప్ సీనియర్ హీరోలు సైతం పాయల్‌తో సినిమాకి వెయిట్ చేస్తున్నారు అంటూ దాని సారాంశం. అది అలా ఉంటే 'జై సింహా' తరువాత బాలయ్య, కేఎల్ రవికుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా నటిస్తూ డ్యూయల్ రోల్‌‌లో అలరించనున్నాడని తెలుస్తోంది. అయితే అప్పట్లో 'జై సింహా'‌లో హీరోయిన్‌గా నటించిన హరిప్రియకే ఈ సినిమాలో కూడా అవకాశం ఇవ్వనున్నారంటూ కొన్ని వార్తలు వినిపించినా, చివరకు ఆ ఆఫర్ పాయల్ రాజపు‌త్‌కు దక్కిందని సోషల్ మీడియా కన్ఫామ్ చేసేసింది.

పాయల్ రాజ్‌పుత్ Photo: Instagram
పాయల్ రాజ్‌పుత్  Photo: Instagram


అయితే ఈ సినిమా నిర్మాత సి. కళ్యాణ్ మాత్రం ఈ వార్తలు ఒట్టి పుకార్లు అని తేల్చేసారు. అసలు పాయల్‌ని ఈ చిత్రానికి హీరోయిన్‌గా అనుకోలేదని, ఇంతకముందు ఒక సీనియర్ హీరోయిన్‌ను ఈ విషయం గురించి కలిసినా ఇంకా ఎవ్వరిని ఫైనల్ చెయ్యలేదు అని, పాయల్ ఈ సినిమాలో హీరోయిన్ అంటూ వచ్చిన వార్తలు కేవలం రూమర్లు అని ఆయన పేర్కోన్నారు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>