హీరోయిన్ ముక్కు పగలగొట్టిన ఫ్యాన్స్.. సందట్లో సడేమియా..

ఈ ఘటనకు సంబంధించి హీరోయిన్ తల్లి సూపర్ మార్కెట్ నిర్వాహకుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది.

news18-telugu
Updated: October 31, 2019, 5:45 PM IST
హీరోయిన్ ముక్కు పగలగొట్టిన ఫ్యాన్స్.. సందట్లో సడేమియా..
నూరిన్ షరీఫ్ (File)
  • Share this:
హీరోయిన్లను చూసేందుకు అభిమానలు అత్యంత ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. హీరోయిన్లు షోరూమ్ ఓపెనింగ్‌కు వస్తున్నారంటే ఫ్యాన్స్ అంతకంటే ముందే వెళ్లి.. అక్కడ వాలిపోతారు. ఓ సెల్ఫీ తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే, అలాంటి సందర్భాల్లో కొన్నికొన్ని సార్లు హీరోయిన్లకు ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అలాంటి ఘటనే మళయాళ నటి నూరిన్ షరీఫ్‌కు ఎదురైంది. ఒరు ఆదార్ లవ్ సినిమా హీరోయిన్ నూరిన్ షరీఫ్.. ఓ కేరళలో ఓ సూపర్ మార్కెట్ ఓపెనింగ్ కోసం వెళ్లింది .అయితే, అక్కడకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. నూరిన్ షరీఫ్ కారు దిగి ముందుకు వెళ్లలేనంతగా రద్దీ ఏర్పడింది. దీంతో హీరోయిన్ కారులో నుంచి దిగి.. నడుచుకుంటూ వెళ్లింది. ఈక్రమంలో కొందరు అభిమానులు అత్యుత్సాహం చూపించారు. హీరోయిన్‌ ముక్కు మీద గుద్దారు. ఈ ఘటన చూసిన తర్వాత షాపు ఓనర్లు అభిమానులను శాంతింపజేశారు.

ఈ ఘటనకు సంబంధించి హీరోయిన్ తల్లి సూపర్ మార్కెట్ నిర్వాహకుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కెట్ ఓపెనింగ్ 4 గంటలకు అని తమకు చెప్పారని, ఆ సమయానికే వచ్చేలా తాము రెడీ అయితే, తమను 6 గంటల వరకు హోటల్లోనే ఉండాలని చెప్పారన్నారు. ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలని సూచించగా, చివరకు హీరోయిన్ ముక్కు పగిలింది.

పాక్ రైల్లో అగ్నిప్రమాదం.. 65 మంది సజీవదహనం

Published by: Ashok Kumar Bonepalli
First published: October 31, 2019, 5:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading