‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచమైన నిధి.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాతో పలకరించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని నమోదు చేయలేదు. ఆ తర్వాత ఈ భామ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఓ బంపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఒకవైపు వెండితెరపై సందడి చేస్తూనే సామాజిక మాధ్యమాల వేదికపైనా హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతుంటుంది నిధి. తాజాగా ఈ భామ మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టాక్ షోకు ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా తన తొలి ప్రేమ, ఫస్ట్ డేట్, కాబోయే వరుడు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.. ఈ సందర్భంగా నిధి తను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు తన స్నేహితుడిపై క్రష్ ఉండేదని. అయితే అది ఆకర్షణ మాత్రమే అని తర్వాత అర్థమైందని. ఆ అబ్బాయి ఇప్పటికీ మంచి స్నేహితుడిగా ఉన్నాడు అంటూ చెప్పింది. అయితే కొంచెం పెద్దయ్యాక ఓ అబ్బాయితో డేట్‌కు వెళ్లానని. తనకు తొలి వాలంటైన్ ప్రపోజ్ కూడా తన నుంచే అందిందదని. ఇంకో విశేషం ఏంటంటే.. అదే రోజు అతని పుట్టినరోజు కూడా అంటూ తెలిపింది నిధి. హీరోల్లో ఫస్ట్ క్రష్ మాత్రం షారఖ్ ఖాన్పైనే అని ఈ సందర్భంగా తెలిపింది నిధి.

మంచు లక్ష్మీ షోలో నిధి అగర్వాల్ (Voot/Photo)
ఈ ఇంటర్వ్యూలో నిధి "నన్ను చేసుకునే వాడు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని పెద్దగా కోరికలు లేవు. మంచిగా నవ్వించే వ్యక్తయితే చాలు. నచ్చిన వ్యక్తితో మన ఇంట్లోనే ఉండాలి. చాలా సింపుల్‌గా ఇంటి భోజనమో, లేక జంక్ ఫుడ్డో తీసుకుంటూ హాయిగా టీవీ చూసుకుంటూ ఒకరికొకరం కబుర్లు చెప్పుకోవాలనేది తన కోరిక అంటూ తెలిపింది. అయితే తనకు కాబోయే వ్యక్తి సిక్స్‌ప్యాక్ రాముడులాా ఉండాలంటూ ఈ షోలో వెల్లడించింది. డేట్‌కు వెళ్లాలంటే టాలీవుడ్ హీరోల్లో రామ్, అఖిల్ ఇద్దరితో డేట్‌కు వెళ్లడానికి సిద్దమే అంటూ ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:October 23, 2019, 12:41 IST