Home /News /movies /

ACTRESS NAZRIYA NAZIM OPENS ABOUT HER HUSBAND FAHADH FAASIL HEALTH CONDITION PK

Nazriya Nazim: ఆయన బాగానే ఉన్నాడు.. భర్త ఫహాద్ ఫాజిల్ ఆరోగ్యంపై నజ్రియా క్లారిటీ..

ఫహాద్ ఫాజిల్ నజ్రియా నజిమ్ (Nazriya Fahadh)

ఫహాద్ ఫాజిల్ నజ్రియా నజిమ్ (Nazriya Fahadh)

Nazriya Nazim: సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య చేదువార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. అదే సమయంలో మొన్నీమధ్యే మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్..

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య చేదువార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. అదే సమయంలో మొన్నీమధ్యే మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ షూటింగ్ సమయంలో గాయపడ్డాడని తెలుసుకుని షాక్ అయ్యారు అభిమానులు. క్షణాల్లో ఈ వార్త వైరల్ అయింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా కాలుజారి పడ్డాడు ఫహాద్. ప్రస్తుతం ఈయన ‘మలయన్ కుంజు’ సినిమాలో నటిస్తున్నాడు. ఏడాదంతా వరస సినిమాలు చేస్తూనే ఉంటాడు ఫహాద్. ఈ క్రమంలోనే ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్‌లో భాగంగా ఈయన కిందపడిపోవడంతో ముక్కు, తలకు బలమైన గాయాలయ్యాయి. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. కొన్ని రోజులుగా ఈయన ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం ఓ భారీ ఇంటి సెట్ నిర్మించారు. ఇందులో ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో కాలు జారి పడిపోయాడు ఫహాద్. సీన్ ప్రకారం ఆ ఇల్లు కూలిపోతున్న సమయంలో ఫహాద్ ఫాజిల్ తప్పించుకోవాలి. కానీ సరిగ్గా అదే సమయంలో టైమింగ్ మిస్ అయ్యాడు ఫహాద్. కాలు జారి కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటి నుంచి బయటకు దూకే సమయంలో పట్టు తప్పి అక్కడే పడిపోయాడు. దాంతో ముక్కుకు బలమైన గాయం అయింది. వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. గాయం పెద్దదే అయినా కూడా ఫాజిల్ కు ఎలాంటి ప్రమాదం లేదని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.

ఈయన ఆరోగ్యంపై మలయాళ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఎప్పటికప్పుడు ఫాజిల్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన భార్య, నటి నజ్రియా నజిమ్ తన భర్త ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చింది. ఎవరూ ఫహాద్ ఆరోగ్యంపై కంగారు పడాల్సిన అవసరం లేదని.. ఆయన చాలా బాగున్నారని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఫొటోను షేర్ చేసింది. ఈ ఇద్దరూ 2014లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి నజ్రియా సినిమాలకు దూరమైంది. ఈ మధ్యే మళ్లీ సినిమాలు చేస్తుంది నజ్రియా. తెలుగులో నాని హీరోగా వస్తున్న అంటే సుందరానికి సినిమాలో కూడా నటిస్తుంది ఈమె.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Fahadh Faasil, Malayala Cinema, Nazriya Nazim

తదుపరి వార్తలు