Nayanatara: నయనతార మజాకా... నచ్చకపోతే ఒప్పుకోదంతే...

Nayanatara: తన మనసుకు నచ్చకపోతే ఎలాంటి ఆఫర్‌కైనా నో చెప్పే నయన్... మరోసారి భారీ ఆఫర్‌ను రిజక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: July 26, 2019, 8:17 PM IST
Nayanatara: నయనతార మజాకా... నచ్చకపోతే ఒప్పుకోదంతే...
నయనతార (ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రస్తుతం ఉన్న సినీ ఇండస్ట్రీలో నయనతార సమ్‌థింగ్ డిఫరెంట్ అనే చెప్పాలి. నచ్చితే ఏ పాత్రకైనా ఓకే చెప్పే నయనతార... తనకు నచ్చకపోతే మాత్రం ఎలాంటి సినిమానైనా వదలుకోవడానికి వెనకాడదనే టాక్ ఉంది. అలా ఎన్నో సినిమాలను మిస్ చేసుకున్న నయనతార...ఇప్పటికీ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా తన రేంజ్‌ను కొనసాగిస్తోంది. ఒక్కో సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకునే నయన్... కథ, క్యారెక్టర్ నచ్చకపోతే మాత్రం ఎంతటి భారీ ఆఫర్‌ అయినా తిరస్కరిస్తుందనే ప్రచారం సినీ ఇండస్ట్రీలో సాగుతోంది. తాజాగా ఈ అందాల భామ ఇదే రకంగా ఓ భారీ ఆఫర్‌ను వదులుకుని కోలీవుడ్ వర్గాలకు షాక్ ఇచ్చిందని సమాచారం.

శరవణన్ షోరూం యజమాని లెజండ్ శరవణన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో నటించే అవకాశం దక్కిందట. ఇందుకోసం రూ. 10 కోట్ల పారితోషకం ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు ముందుకొచ్చారని సమాచారం. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 3 నుంచి రూ. 5 కోట్లు తీసుకుంటున్న నయన్‌కు... ఈ సినిమా కోసం ఏకంగా రూ. 10 కోట్లు ఇస్తామని నిర్మాతలు ఆఫర్ చేశారట. అయితే నయన్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. భారీ రెమ్యూనరేషన్‌కు ఏ మాత్రం టెంప్ట్ కాకుండా ఈ ఆఫర్‌ను నయన్ తిరస్కరించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రూ. 10 కోట్ల రూపాయల ఆఫర్‌ను రిజక్ట్ చేసిన నయనతార... మరోసారి తాను మిగతా హీరోయిన్ల కంటే భిన్నమని ప్రూవ్ చేసుకుందని సినీజనం చర్చించుకుంటున్నారు.

First published: July 26, 2019, 8:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading