సీనియర్ నటి సంచలనం... ఆ హీరో నా స్కర్ట్‌లో చేయి పెట్టాడు..

#MeToo : మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. తాజాగా ఓ సీనియర్ నటి తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కోన్న చేదు అనుభవాల్నీ మీడియాతో పంచుకున్నారు.

news18-telugu
Updated: October 15, 2019, 12:12 PM IST
సీనియర్ నటి సంచలనం... ఆ హీరో నా స్కర్ట్‌లో చేయి పెట్టాడు..
Instagram
  • Share this:
#MeToo :  మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది హీరోయిన్స్ పాటు పాటు వివిధ రంగాల్లో పనిచేస్తోన్న మహిళలు తమ వ‌ృత్తి పరంగా ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మన దేశంలో నటి తనుశ్రీ దత్తా మీటూ ఉద్యమానికి ఊపిరిపోయగా... తెలుగులో శ్రీరెడ్డి ఆ ఉద్యమాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. కాగా  కాస్తా సల్లబడ్డ మీటూ ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది. మీటూ ఉద్యమం మొదట హాలీవుడ్‌లో మొదలైన విషయం తెలిసిందే. తాజాగా బ్రిటీష్ నటి నవోమి హారీస్‌ తనకు ఎదురైన చేదు అనుభవాల్నీ మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న భయంకర పరిస్థితుల్నీ బయటపెట్టారు.
ఆమె మాట్లాడుతూ.. తనకు 20 ఏళ్ల వయస్సు  ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చానని.. అందులో భాగంగా వేశాల కోసం పలు చోట్ల ఆడిషన్స్‌కు వెళ్లాదాన్నని తెలిపింది. అయితే  ఓ రోజు ఓ స్టార్‌ హీరో సినిమా కోసం ఆడిషన్స్‌కు వెళ్లానని.. ఆ ఆడిషన్‌లో  కాస్టింగ్ డైరెక్టర్‌, సినిమా డైరెక్టర్, ఆ సినిమాలో నటించనున్న స్టార్ హీరో ఉన్నాడని.. అయితే ఆడిషన్స్ కోసం అక్కడి వెళ్లిన నాతో ఆ స్టార్ హీరో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కోంది. ఆ స్టార్ హీరో నాతో మాట్లాడుతూ.. నా స్కర్ట్ లోకి చేయి పెట్టి అసభ్యకరంగా టచ్‌ చేశాడు. ఈ ఆకస్మిక ఘటనతో భయంతో వణికి పోయానని తెలిపింది. కాగా హీరో అలా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే.. అక్కడ ఉన్నవారు ఎవరూ ఏమి అనలేదని.. ఒక్కరూ ఓ మాట మాట్లాడలేదని.. అలాగే చూస్తూ ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.  ఆ భయంకర ఘటన తను జీవితంలో మర్చి పోలేనిదని పేర్కోంది. అయితే అప్పుడప్పుడే అవకాశాలు అందిపచ్చుకుంటున్న తాను ఆ ఘటన గురించి బయట ఎక్కడా చర్చించలేదని తెలిపింది. అంతేకాదు ఇప్పుడు కూడా అతని పేరును బయట పెట్టాలనే ఆలోచన లేదని పేర్కోంది. నవోమి హారిస్ ప్రస్తుతం జేమ్స్ బాండ్ చిత్రం 'నో టైమ్ టు డై' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా 2020 ఎప్రిల్ 3 న విడుదల కానుంది.కాగా మన దేశంలో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కున్నాని.. పదేళ్ల క్రితం ఓ సినిమా షూటింగులో సీనియర్ నటుడు నానా పాటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపణలు చేసి సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఒక్కసారిగా దేశంలో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. అందులో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ ప్రియా రమణి కూడా, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేయడం, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం కూడా తెలిసిన విషయమే. 
View this post on Instagram
 

My favourite pic from tonight!! #theredsareelook


A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on
First published: October 15, 2019, 12:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading