వారణాసిలో మిస్తీ చక్రవర్తి... పక్షులకు ఆహారం వేస్తూ పరమానందం...

Mishti Chakravarty : తెలుగు తెరపై అప్పుడప్పుడూ కనిపిస్తూ అలరించే హీరోయిన్ మిస్తీ చక్రవర్తి... ఇప్పుడు పుణ్యక్షేత్రం కాశీలో సందడి చేస్తోంది.

news18-telugu
Updated: January 26, 2020, 1:49 PM IST
వారణాసిలో మిస్తీ చక్రవర్తి... పక్షులకు ఆహారం వేస్తూ పరమానందం...
మిస్తీ చక్రవర్తి (credit - insta - Mishti Chakravarty)
  • Share this:
Mishti Chakravarty :  గతేడాది మణికర్ణిక, బుర్రకథ సినిమాలతో ప్రేక్షకుల్ని పలుకరించిన టాలీవుడ్ బ్యూటీ మిస్తీ చక్రవర్తి... అవి అంతగా సక్సెస్ ఇవ్వకపోయినా... మరో సినిమాతో... ఈ సంవత్సరం బిజీ అయిపోయింది. తాజాగా సినిమా షూటింగ్ కోసం పుణ్యక్షేత్రం వారణాసి వెళ్లిన ఈ కోల్‌కతా బ్యూటీ... అక్కడ ప్రాణికోటిపై తెగ ప్రేమ కురిపించేస్తోంది. పక్షులు, కోతులు, కుక్కలు ఇలా ఏవి కనిపిస్తే వాటిని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా నిమురుతోంది. వాటికి ఆహారం పెట్టి... ఎంచక్కా చూసుకుంటోంది. ఇదే కదా జీవితం అంటే, జీవితంలో ప్రతీ క్షణాన్నీ ఆస్వాదించాలి అంటూ వేదాంత ధోరణిలో మంచి విషయాలు చెబుతోంది. గంగానదిలో ప్రయాణిస్తూ.... పక్షులకు ఆహారం వెయ్యడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. 

View this post on Instagram
 

The simple pleasures of life can bring greatest happiness..... . . . . . #nature #birdfeeding #kashi #varanasi #ontheganges #sailing #amazingcreatures #videooftheday #innerpeace #beautifullife


A post shared by Mishti Chakravarty (@mishtichakravarty) on
 
View this post on Instagram
 

Perhaps this is how #love looks like ❤️ #bonding #makingnewfriends #childrenofgod


A post shared by Mishti Chakravarty (@mishtichakravarty) on

స్వతహాగా వెజిటేరియన్ అయిన మిస్తీ చక్రవర్తి... చాలా మంది తెలుగు హీరోయిన్లలాగే... యానిమల్ లవర్. తనను తాను హార్డ్‌కోర్ లవర్‌గా చెప్పుకునే ఈ ముద్దుగుమ్మ... ఊహాలోకంలో జీవిస్తూ ఉంటుంది. ఇంద్రాణీ చక్రబర్తిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి... తన పేరును మిస్తీ చక్రవర్తిగా మార్చుకున్న ఈ బ్యూటీ... కాంచీ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. ఆ తర్వాత... టాలీవుడ్‌లో నితిన్ సరసన చిన్నదాన నీ కోసం సినిమాలో సందడి చేసింది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మాలీవుడ్‌లో ఆదామ్ జాన్‌లో చేసింది. 
View this post on Instagram
 

Every moment life has so much precious to give, just have the heart to recieve ❤️ #dogsareangels #love #moments #momentstocherish


A post shared by Mishti Chakravarty (@mishtichakravarty) on

కోల్‌కతాలో కన్‌స్ట్రక్షన్ బిజినెస్ ఫ్యామిలీ నుంచీ వచ్చి... ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న మిస్తీ... త్వరలో తన కొత్త సినిమా విశేషాల్ని ఫ్యాన్స్‌తో పంచుకోనుంది. అప్పటివరకూ... తన రెగ్యులర్ పోస్టులతో అడ్జెస్ట్ అవ్వమంటోంది ఫ్యాన్స్‌ని. 
View this post on Instagram
 

The essence of #kashi .... #thelandoftemples


A post shared by Mishti Chakravarty (@mishtichakravarty) onFirst published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు