వేశ్య, పోర్న్ స్టార్ అంటారా ? ... ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై మీరా చోప్రా ఫైర్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను సోషల్ మీడియాలో వేధిస్తున్నారని హీరోయిన్ మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: June 2, 2020, 9:42 PM IST
వేశ్య, పోర్న్ స్టార్ అంటారా ? ... ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై మీరా చోప్రా ఫైర్
మీరా చోెప్రా (Instagram/Photo)
  • Share this:
సోషల్ మీడియాలో తనను ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధిస్తున్నారని హీరోయిన్ మీరా చోప్రా వ్యాఖ్యానించారు. దీనిపై స్వయంగా ఎన్టీఆర్ స్పందించాలని ఆశిస్తున్నట్టు ఆమె కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు తనను వేశ్య, పోర్న్‌ స్టార్‌ వంటి పదాలతో పిలుస్తారని అనుకోలేదని మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎన్టీఆర్ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని చెప్పడం వల్లే ఇలా జరిగిందని కామెంట్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులు తన తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారని వాపోయింది. ఇటువంటి అభిమానులతో సక్సెస్ సాధించినట్టు ఎన్టీఆర్ భావిస్తున్నారా ? అని ప్రశ్నించింది. తన ట్వీట్ పట్ల ఎన్టీఆర్ తప్పకుండా స్పందిస్తారని ఆశిస్తున్నానని మీరా చోప్రా వ్యాఖ్యానించింది.అంతకుమందు సోమవారం రోజున ట్విటర్‌ వేదిగా మీరా చోప్రా అభిమానులతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్నించగా.. దానికి ఆమె మహేష్‌బాబు అని ఆమె సమాధానం ఇచ్చారు. మరో నెటిజన్‌ ఎన్టీఆర్‌ గురించి ప్రశ్నించగా.. తను ఆయన ఫ్యాన్‌ కాదని చెప్పారు. అయితే ఈ సమాధానం చెప్పినందుకు ఎన్టీఆర్‌ అభిమానులు తనను తీవ్రమైన పదాలతో దూషిస్తున్నారని మీరా చోప్రా ఈ రోజు ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై ఎన్టీఆర్‌ స్పందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మరి... మీరా చోప్రా ట్విట్‌పై ఎన్టీఆర్ రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.


First published: June 2, 2020, 9:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading