• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ACTRESS MALAVIKA NAIR IN PRABHAS NAG ASWIN FILM MNJ

Prabhas-Nag Ashwin film: ఆ హీరోయిన్‌ని వ‌ద‌ల‌ని నాగ్ అశ్విన్‌.. ప్ర‌భాస్ మూవీలోనూ ఆఫ‌ర్..!

Prabhas-Nag Ashwin film: ఆ హీరోయిన్‌ని వ‌ద‌ల‌ని నాగ్ అశ్విన్‌.. ప్ర‌భాస్ మూవీలోనూ ఆఫ‌ర్..!

ప్రభాస్, నాగ్ అశ్విన్ Photo : Twitter

టాలీవుడ్‌లో ఉన్న స్టార్ ద‌ర్శ‌కుల్లో నాగ్ అశ్విన్ ఒక‌రు. మ‌హాన‌టి సినిమాతో దేశ‌వ్యాప్తంగా ఈ ద‌ర్శ‌కుడి పేరు మారుమోగిపోయింది. ఇక ప్ర‌భాస్‌తో త‌న త‌దుప‌రి మూవీని ప్ర‌క‌టించిన త‌రువాత నాగ్ అశ్విన్ పేరు మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది.

  • Share this:
    Malavika Nair: టాలీవుడ్‌లో ఉన్న స్టార్ ద‌ర్శ‌కుల్లో నాగ్ అశ్విన్ ఒక‌రు. మ‌హాన‌టి సినిమాతో దేశ‌వ్యాప్తంగా ఈ ద‌ర్శ‌కుడి పేరు మారుమోగిపోయింది. ఇక ప్ర‌భాస్‌తో త‌న త‌దుప‌రి మూవీని ప్ర‌క‌టించిన త‌రువాత నాగ్ అశ్విన్ పేరు మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌భాస్‌తో మూవీని తెర‌కెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. దానికి సంబంధించిన ప‌నుల్లో ఆయ‌న బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే ఖ‌రారైన విష‌యం తెలిసిందే. అలాగే మ‌రో ప్ర‌ధాన‌ పాత్ర‌లో బిగ్‌బీ అమితాబ్ న‌టించనున్నారు. కాగా ఈ మూవీలో ఒక కీల‌క పాత్ర కోసం మాల‌విక నాయ‌ర్‌ని ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది.

    నాని హీరోగా నాగ్ అశ్విన్ తెరెక్కించిన ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి మాల‌విక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మూవీలో మాల‌విక న‌ట‌న‌కు మంచి మార్కులు కూడా ప‌డ్డాయి. ఆ తరువాత సెల‌క్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వ‌స్తోన్న మాల‌విక‌.. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన మ‌హాన‌టి సినిమాలోనూ ఓ పాత్ర‌లో మెరిసింది. జెమినీ గ‌ణేష‌న్ మొద‌టి భార్య పాత్ర‌లో మాల‌విక న‌టించింది. ఇలా త‌న రెండు సినిమాల్లో న‌టించిన మాల‌విక‌కు.. ఇప్పుడు వ‌రుస‌గా త‌న‌ మూడో మూవీలోనూ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.



    ఇవాళ మాల‌విక పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వైజ‌యంతీ మూవీస్ ఓ ట్వీట్ చేసింది. హ్యాపీ బ‌ర్త్‌డే మాల‌విక‌. ఈ సంవ‌త్స‌రం నీతో మ‌ళ్లీ స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాము అని కామెంట్ పెట్టింది. ఈ ట్వీట్‌ని బ‌ట్టి చూస్తుంటే ప్ర‌భాస్ మూవీలో మాల‌విక ఖ‌రారు అయిన‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్ర‌భాస్-నాగ్ అశ్విన్ మూవీని వైజ‌యంతీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ మూవీ మిన‌హా మ‌రో సినిమాను వైజ‌యంతీ మూవీస్ నిర్మించ‌డం లేదు. ఈ క్ర‌మంలో వారి ట్వీట్‌ని బ‌ట్టి చూస్తుంటే ప్ర‌భాస్ మూవీలో మాల‌విక క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుందేమో చూడాలి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. ఇన్నిరోజులు చిన్న హీరోల‌తో న‌టించిన మాల‌విక‌కు.. ఇది పెద్ద ఆఫ‌ర్ అనే చెప్పొచ్చు.
    Published by:Manjula S
    First published: