హీరోయిన్‌ మాధవీలతకు ఎమ్మెల్యే టికెట్...బీజేపీ సంచలన నిర్ణయం

మాధవీలత.. 'నచ్చావులే' సినిమా ద్వారా.. తెలుగు సినిమాకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాని హీరోగా స్నేహితుడా..సినిమాలో నటించారు మాధవీలత. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసిన..సరైన గుర్తింపు రాలేదు.

news18-telugu
Updated: March 29, 2019, 9:02 PM IST
హీరోయిన్‌ మాధవీలతకు ఎమ్మెల్యే టికెట్...బీజేపీ సంచలన నిర్ణయం
మాధవీలత Photo: facebook.com/ActressMaadhaviLatha
  • Share this:
మాధవీలత.. 'నచ్చావులే' సినిమా ద్వారా.. తెలుగు సినిమాకు పరిచయమైన విషయం తెలిసిందే. రవిబాబు దర్మకత్వం వహించిన ఈ సినిమాను రామోజీరావు నిర్మించారు. ఆ సినిమా ద్వారా మాధవీలత మంచి పేరు తెచ్చుకున్నారు.  అయితే అవకాశాలు మాత్రం అనుకున్నంతగా రాలేదు. ఆ తర్వాత నాని హీరోగా స్నేహితుడా..సినిమాలో నటించారు మాధవీలత. ఆ సినిమా తర్వాత కూడా అడపా దడపా సినిమాలు చేసిన..సరైన గుర్తింపు రాలేదు. ఆ మధ్య మీటూ ఉద్యమంలో కూడ తన గళాన్ని వినిపించారు మాధవీలత. అంతేకాకుండా.. ఆమె.. కొన్నాళ్లుగా బీజేపీ తరఫున గళం వినిపిస్తున్నారు.  దీంతో పార్టీ.. మాధవీలతకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ కేటాయించారు. అందులో భాగంగా.. బీజేపీ అధినాయకత్వం ఆదివారం ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మాధవీలత పేరు ఖరారు చేశారు.  మాధవీలత అసలు పేరు పసుపులేటి మాధవి. ఆమె కర్ణాటకలోని బళ్లారిలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత.. అక్కడే ఉన్నత విద్యాభ్యాసం చేసి.. అనంతరం తెలుగు సినిమాల్లో ప్రవేశించించారు.

మాధవీలత Photo: facebook.com/ActressMaadhaviLatha
మాధవీలత Photo: facebook.com/ActressMaadhaviLatha


మాధవీలతకు  సినిమాల్లో పెద్దగా కలిసిరాలేదు..చూడాలీ మరీ..రాజకీయాల్లో ఎలా రాణించనున్నరో..

సమంత అక్కినేని హాట్ ఫోటోస్
First published: March 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు