Actress Kushboo Sundar: ఖుష్బూ ట్విట్టర్ హ్యాక్.. సహాయం చెయ్యండంటూ?

Actress Kushboo Sundar

Actress Kushboo Sundar:  తెలుగు సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తెలుగులోనే కాకుండా తమిళ భాషలలో కూడా నటించి మంచి గుర్తింపు అందుకుంది.

  • Share this:
    Actress Kushboo Sundar:  తెలుగు సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తెలుగులోనే కాకుండా తమిళ భాషలలో కూడా నటించి మంచి గుర్తింపు అందుకుంది. రాజకీయ నాయకురాలిగా బీజేపీ పార్టీలో చేరింది. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాన్ని చూసుకుంటుంది ఖుష్బూ. ఇక తన నటనతోనే కాకుండా వ్యక్తిగత పట్ల కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈమెకు మరోసారి ఓ సమస్య ఎదురయింది.

    సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఖుష్బూ నిత్యం ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా షేర్ చేసుకుంటుంది. ఇక ట్విట్టర్ వేదికగా ఎన్నో ట్వీట్లు, పోస్టులు చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఖుష్బూ ట్వీటర్ మరోసారి హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, మూడు రోజుల నుంచి పాస్వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తుంటే వీలు కావట్లేదని తెలిపింది.

    దాంతో అభిమానులను సాయం కోరుతూ.. ట్విట్టర్ కూడా ఎలాంటి సహాయం చేయడం లేదని, తన అకౌంట్ సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపింది ఖుష్బూ. ఏం జరుగుతుందో తెలియడం లేదని, ఈ సమస్యను పరిష్కరిస్తే వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని తెలిపింది. ఇక 2020 ఏప్రిల్ లో కూడా ఖుష్బూ ట్విట్టర్ ఖాతా హాకర్లు సంగతి తెలిసిందే. అంతేకాకుండా అందులో తన పేరును బ్రియాన్ గా కూడా మార్చారు. ఆమె ఫోటోలను మార్చడమే కాకుండా తను పంచుకున్న ట్వీట్స్, పోస్టులన్నీ డిలీట్ చేశారు. ఇక తాజాగా కూడా ఇలా కావడంతో ఖుష్బూ తెగ టెన్షన్ పడుతుంది.

    Actress Kushboo Sundar
    Actress Kushboo Sundar


    ఖుష్బూ నే కాకుండా ఇది వరకు ఎంతోమంది సెలబ్రెటీల సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాక్ చేశారు కొందరు హ్యాకర్లు. అంతేకాకుండా కొన్ని బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు. ఇక ఖుష్బూ ట్విట్టర్ హాక్ అవడంతో ఆమె అభిమానులు ఆమెకు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ధైర్యం ఇస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published: