Home /News /movies /

ACTRESS KUSHBOO COMMENTS ON MEENA HUSBAND DEATH SB

Meena Husband: మీన భర్తపై తప్పుడు వార్తలు వద్దు... ఆయన అలా చనిపోలేదు: ఖుష్బూ

మీనా భర్త మృతి

మీనా భర్త మృతి

మూడు నెలల క్రితం విద్యా సాగర్ కు కరోనా సోకటం నిజమేనన్నారు. అయితే  కరోనా సోకడం వల్ల విద్యాసాగర్ లంగ్స్ కు హాని జరిగిందని కుష్బూ అన్నారు.

    టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా భర్త  ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వార్త సినీ ప్రముఖులతో పాటు అభిమానులను ఎంతగానో బాధపెట్టింది. అయితే మీనా భర్త మృతిపై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఆయన లంగ్స్ ఇన్‌ఫెక్షన్ వల్ల చనిపోయారని కొందరు.. కాదు కరోనా వల్ల చనిపోయారని మరికొందరు.. మీనా భర్త విద్యా సాగర్ మృతికి పావురాలే కారణమని  ఇంకొందరు కథనాలు ప్రసారం చేశారు. అయితే మీనా భర్త విద్యాసాగర్ మరణానికి ఇదే కారణమంటూ వేర్వేరు కథనాలు ప్రచారంలోకి వస్తుండటంతో అభిమానులు సైతం ఆందోళన చెందారు.

    మీనా భర్త మృతి గురించి కుష్బూ మట్లాడుతూ మీనా భర్త మృతి విషయంలో మీడియా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మూడు నెలల క్రితం విద్యా సాగర్ కు కరోనా సోకటం నిజమేనన్నారు. అయితే  కరోనా సోకడం వల్ల విద్యాసాగర్ లంగ్స్ కు హాని జరిగిందని కుష్బూ అన్నారు. కరోనా వల్ల విద్యాసాగర్ చనిపోయాడని తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని ఆమె కోరారు. మనం జాగ్రత్తగా ఉండాలని ఎలాంటి భయాన్ని కలిగించవద్దని ఆమె కామెంట్లు చేశారు.



    మీనా భర్త విద్యాసాగర్ మరణ వార్త తెలిసి తన గుండె పగిలిందని కుష్బూ అన్నారు. భయంకరమైన వార్తతో తనకు రోజు మొదలైందని ఆమె కామెంట్లు చేశారు. ఊపిరితిత్తుల సమస్యతో విద్యాసాగర్ చాలాకాలం నుంచి బాధ పడుతున్నాడని చెప్పుకొచ్చారు కుష్బూ. మరోవైపు మీనా భర్త మృతికి సంబంధించి పావురాల వ్యర్థాలు కారణమని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల గురించి మీనా కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

    మీనా విద్యాసాగర్ లకు 2009 సంవత్సరంలో వివాహం జరిగింది. వీళ్ల పెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి కాగా ఈ జంటకు నైనిక అనే కూతురు ఉంది. నైనిక ఇప్పటికే తమిళంలో పలు సినిమాల్లో నటించింది. ఇక విద్యాసాగర్ మరణవార్త విని పలువురు కోలీవుడ్ సెలబ్రిటీలు షాకయ్యారు. సోషల్ మీడియా వేదికగా పలువురు మీనా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Meena, Senior actress meena, Tollywood

    తదుపరి వార్తలు