కియారా అద్వానీ.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ‘ఎం.ఎస్. ధోని’ సినిమా చేసిన తర్వాత అవకాశాలు దక్కించుకోలేకపోయింది. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ చేసి బీభత్సమైన ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. ఘాటైన రొమాంటిక్ సీన్లలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సిరీస్‌లో అమాయకపు పాత్రలో కనిపిస్తూనే కియరా హస్త ప్రయోగం చేసుకునే అమ్మాయిగా కనిపించింది. ఆ హస్త ప్రయోగం సీన్లు సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే, తాజాగా.. అలాంటి వెబ్ సిరీస్‌లో మరోసారి కియారా నటించబోతోందని తెలిసింది. కరణ్ జోహార్ దర్శకత్వంలోనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ చేయబోతోందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంతకం కూడా చేసిందట.
ఇదిలా ఉండగా, తాజాగా.. కియారా అద్వానీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. మంగళవారం పొద్దుపోయాక ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి తన ఫాలోయర్లకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె ఈ సమాచారాన్ని చేరవేసింది. తన ఫాలోయర్లు ఎవ్వరూ తన ట్విట్టర్ ఖాతాలో ఉన్న లింకును ఓపెన్ చేయవద్దని కోరింది. ఏవైనా అసంబద్ధ ట్వీట్లు వస్తే పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేసింది. అంతకుముందు.. అమితాబ్, షాహిద్ కపూర్.. తదితర నటీనటుల ట్విట్టర్ అకౌంట్లు కూడా హ్యాక్‌కు గురైన సంగతి తెలిసిందే.
కియారా అద్వానీ కిక్కెక్కించే ఫోటోస్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kiara advani, Telugu Movie News, Twitter