హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan- Kiara Advani: రామ్‌తో రెండోసారి సీత‌.. ఆ పాత్రలో కనిపించబోతున్న కియారా

Ram Charan- Kiara Advani: రామ్‌తో రెండోసారి సీత‌.. ఆ పాత్రలో కనిపించబోతున్న కియారా

రామ్ చరణ్ కియారా అద్వానీ

రామ్ చరణ్ కియారా అద్వానీ

Ram Charan- Shankar: లెజండ‌రీ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. చెర్రీ 15వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీని బ‌డా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా శంక‌ర్- చెర్రీ ప్రాజెక్ట్ ఉండ‌బోతుంది. ఇదిలా ఉంటే ఈ క్రేజీ మూవీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి.. ఇందులో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టించనున్నారన్న విష‌యంపై ప‌లువురి పేర్లు వినిపించాయి

ఇంకా చదవండి ...

  Ram Charan- Shankar: లెజండ‌రీ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. చెర్రీ 15వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీని బ‌డా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా శంక‌ర్- చెర్రీ ప్రాజెక్ట్ ఉండ‌బోతుంది. ఇదిలా ఉంటే ఈ క్రేజీ మూవీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి.. ఇందులో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టించనున్నారన్న విష‌యంపై ప‌లువురి పేర్లు వినిపించాయి. కొరియ‌న్ హీరోయిన్‌ని శంక‌ర్ తీసుకోవాల‌ని అనుకున్న‌ట్లు టాక్ న‌డిచింది. అయితే వేటిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఇదిలా ఉంటే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీలో హీరోయిన్‌గా కియారా అద్వానీ ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది. ప‌లువురి పేర్ల‌ను ప‌రిశీలించిన చిత్ర యూనిట్ కియారాను ఫైనల్ చేసింద‌ని.. దీనికి సంబంధించి ఆమెతో సంప్ర‌దింపులు కూడా అయిన‌ట్లు టాక్.

  తెలుగులో ఇప్ప‌టికే కియారా రెండు సినిమాల్లో న‌టించింది. అందులో రామ్ చరణ్ వినయ విధేయ రామ మూవీ ఒకటి. మ‌రోవైపు బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ దూసుకుపోతోంది. ఈ నేప‌థ్యంలో కియారానే బెస్ట్ ఆప్ష‌న్ అని మూవీ యూనిట్ భావించింద‌ట‌. ఇక ఈ ప్రాజెక్ట్‌లో న‌టించేందుకు కియారా ఒప్పుకోగా.. ఆమె రిపోర్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే. కాగా ఈ నెల 27న చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  ఇక పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో జూన్ నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నుందట‌. అంతేకాదు ఈ మూవీని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని శంక‌ర్ భావిస్తున్నార‌ట‌. వ‌చ్చే ఏడాదికి ఈ చిత్రాన్ని ఎలాగైనా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకుంటున్న శంక‌ర్ అందుకు త‌గ్గ‌ట్లుగా ప్లాన్ కూడా చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్‌లో న‌టిస్తున్నారు. అలాగే చిరంజీవి ఆచార్య‌లో ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ జూన్‌కి పూర్తి అవ్వ‌నుండ‌గా.. ఆ త‌రువాత శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.

  Published by:Manjula S
  First published:

  Tags: Kiara advani, Ram Charan, Shankar

  ఉత్తమ కథలు