Kiara Advani: కియారా అద్వాణీ అదిరిపోయే వ‌ర్కౌట్లు.. చూస్తే షాక్ అవ్వ‌డం ఖాయం

కియారా అద్వానీ (Instagram/Photo)

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు(Mahesh Babu) హీరోగా న‌టించిన 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ(Kiara Advani).. మొద‌టి సినిమాతోనే అంద‌రినీ తెగ ఆక‌ట్టుకుంది. ఆ త‌రువాత రామ్ చ‌ర‌ణ్‌(Ram Charan)తో విన‌య విధేయ రామ‌లో న‌టించింది

  • Share this:
    Kiara Advani: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన 'భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా.. మొద‌టి సినిమాతోనే అంద‌రినీ తెగ ఆక‌ట్టుకుంది. ఆ త‌రువాత రామ్ చ‌ర‌ణ్‌తో విన‌య విధేయ రామ‌లో న‌టించింది. కానీ ఆ మూవీ ఫ్లాప్ అవ్వ‌డం.. ఆ త‌రువాత హిందీలో వ‌రుస సినిమా అవ‌కాశాలు రావ‌డంతో బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది ఈ హీరోయిన్. ఆ మ‌ధ్య‌న మ‌ళ్లీ మీరు టాలీవుడ్‌కి వ‌స్తారా.? అన్న ప్ర‌శ్న‌కు.. క‌చ్చితంగా వ‌స్తాన‌ని అయితే చెప్పింది కానీ.. ఇంత‌వ‌ర‌కు మ‌రో తెలుగు మూవీకి సంత‌కం చేయ‌లేదు కియారా. ఇక ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే మూవీలో కియారా హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదంతా ప‌క్క‌న‌పెడితే.. ఫిట్‌నెస్‌పై ఈ బ్యూటీకి ప్ర‌త్యేకమైన శ్ర‌ద్ధ ఉంది.

    బాడీ ఫిట్‌నెస్ కోసం ఎక్కువ‌గా జిమ్‌లో గ‌డిపే ఈ బ్యూటీ.. తాజాగా కొన్ని వీడియోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో ట్రైన‌ర్ నేప‌థ్యంలో కొన్ని క‌ష్ట‌మైన వ‌ర్కౌట్ల‌ను చేస్తోంది. ఈ వీడియోలకు 2021 కోసం చార్జ్ అవుతున్నా అని కియారా కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియోలకు కియారా ఫ్యాన్స్‌ని బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం కియారా బూల్ భులియా 2, జ‌గ్ జ‌గ్ జీయో చిత్రాల్లో న‌టిస్తోంది.








    View this post on Instagram






    A post shared by KIARA (@kiaraaliaadvani)






    మ‌రోవైపు ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి, ఒలింపిక్ ప‌త‌క విజేత పీవీ సింధు కోసం వ‌ర్కౌట్ల‌ను ప్రారంభించారు. థాయ్‌లాండ్ టోర్న‌మెంట్ కోసం సింధు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టిన సింధు.. ష‌టిల్ కోర్టులో ప్ర‌త్య‌ర్థిని ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నారు.








    View this post on Instagram






    A post shared by sindhu pv (@pvsindhu1)






    దానికి సంబంధించిన వీడియోను సింధు సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు పీవీ సింధు. నీకు కావాల‌నుకుంటే నువ్వు వ‌ర్క్ చేయాలంటే సింధు ఆ వీడియోకు కామెంట్ పెట్టారు. దానికి థాయ్‌లాండ్ ఓపెన్ 2021, ఫ‌స్ట్ టోర్న‌మెంట్ ఆఫ్ ది ఇయ‌ర్, ఎక్సైటెడ్, లెట్స్ గో అని హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టారు.
    Published by:Manjula S
    First published: