• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ACTRESS KEERTHY SURESH TRADITIONAL LOOK LEAKED FROM MAHESH BABU SARKARU VAARI PAATA MNJ

Sarkaru Vaari Paata- Keerthy Suresh: మ‌హేష్ బాబు 'స‌ర్కారు వారి పాట' నుంచి కీర్తి సురేష్ లుక్ లీక్

Sarkaru Vaari Paata- Keerthy Suresh:  మ‌హేష్ బాబు 'స‌ర్కారు వారి పాట' నుంచి కీర్తి సురేష్ లుక్ లీక్

మహేష్ బాబు, కీర్తి సురేష్ Photo : Twitter

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు(mahesh Babu) హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రం స‌ర్కారు వారి పాట‌(Sarkaru Vaari Paata). ప‌ర‌శురామ్(Parasuram) ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మొద‌టిసారి మ‌హేష్ స‌ర‌సన జోడీ క‌డుతోంది కీర్తి సురేష్(Keerthy Suresh). ఇక ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే దుబాయ్‌లో ప్రారంభం అయ్యింది.

  • Share this:
    Mahesh Babu- Keerthy Suresh: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప‌ర‌శురామ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మొద‌టిసారి మ‌హేష్ స‌ర‌సన జోడీ క‌డుతోంది కీర్తి సురేష్. ఇక ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే దుబాయ్‌లో ప్రారంభం అయ్యింది. ఇందులో ప్ర‌ధాన పాత్రాధారులంతా పాల్గొన్నారు. అయితే ఈ మూవీ ఇలా ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే లీక్ వీరులు త‌మ ప‌ని ప్రారంభించేశారు. ఇందులో నుంచి లుక్‌ల‌ను లీక్ చేయ‌డం స్టార్ట్ చేశారు. ఈ క్ర‌మంలో స‌ర్కారు వారి పాటలో నుంచి కీర్తి సురేష్ లుక్ లీక్ అయ్యింది. అందులో చీర క‌ట్టుకొని పువ్వులు పెట్టుకొని అద‌ర‌గొట్టేస్తోంది కీర్తి సురేష్. ఇక అక్క‌డున్న లొకేష‌న్‌ని బ‌ట్టి చూస్తే అది ఒక మాల్ అని అర్థ‌మ‌వుతోంది.

    కాగా మ‌నీ లాండ‌రింగ్, స్కామ్‌ల ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కుతుండగా.. ఇందులో మ‌హేష్ బాబు కొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డంతో పాటు సినిమాల‌పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. కాగా గ‌తేడాది స‌రిలేరు నీకెవ్వ‌రుతో త‌న ఖాతాలో మ‌రో హ్యాట్రిక్‌ని వేసుకున్న మ‌హేష్ బాబు.. స‌ర్కారు వారి పాట‌తో దాన్ని అలానే కంటిన్యూ చేయాల‌నుకుంటున్నారు.



    ఇక మ‌రోవైపు నితిన్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టించిన రంగ్‌దే షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి అయ్యింది. రొమాంటిక్ ప్రేమ క‌థ‌తో తెర‌కెక్కిన ఈ మూవీ మార్చి 26న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు