Home /News /movies /

ACTRESS KEERTHY SURESH ABOUT HER CAMERA APPEARANCE IN BLOCK BUSTER JATHI RATNALU MNJ

Jathi Ratnalu- Keerthy Suresh: 'జాతిర‌త్నాలు'లో కెమెరా అప్పియ‌రెన్స్‌పై మ‌హాన‌టి స్పంద‌న ఇదే

కీర్తి సురేష్ జాతి ర‌త్నాలు

కీర్తి సురేష్ జాతి ర‌త్నాలు

Jathi Ratnalu- Keerthy Suresh: న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి, ఫ‌రియా అబ్దుల్లా ముఖ్య పాత్ర‌ల్లో అనుదీప్ తెర‌కెక్కించిన‌ జాతి ర‌త్నాలు ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి థియేట‌ర్లలో దూసుకుపోతోంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా వ‌చ్చిన ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

ఇంకా చదవండి ...
    Jathi Ratnalu- Keerthy Suresh: న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి, ఫ‌రియా అబ్దుల్లా ముఖ్య పాత్ర‌ల్లో అనుదీప్ తెర‌కెక్కించిన‌ జాతి ర‌త్నాలు ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి థియేట‌ర్లలో దూసుకుపోతోంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా వ‌చ్చిన ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. విడుద‌లైన మొద‌టి రోజు నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావ‌డంతో క‌లెక్ష‌న్ల‌లోనూ జాతి ర‌త్నాలు త‌మ హ‌వాను చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ ఈ మూవీకి మంచి క‌లెక్ష‌న్లు వస్తున్నాయి. ఇక ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు కూడా స్పందిస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు క‌డుపుబ్బా న‌వ్వుకున్నామ‌ని, ఇంత‌గా ఈ కాలంలో న‌వ్వుకోలేద‌ని, జంధ్యాల సినిమాల‌ను గుర్తు చేశార‌ని మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ స‌హా ప‌లువురు సినిమాపై త‌మ రివ్యూను ఇచ్చారు. కాగా ఈ మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కీర్తి సురేష్ కెమెరా అప్పియ‌రెన్స్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. న‌వీన్ కాలేజీ ల‌వ‌ర్ వ‌న‌జాక్షి పాత్ర‌లో కీర్తి న‌టించింది.

    కాగా ఈ మూవీలో భాగం అవ్వ‌డంపై కీర్తి త‌న సోష‌ల్ మీడియాలో స్పందించారు. తన ప్రోమో స్క్రీన్ షాట్‌ని ఇన్‌స్టా రీల్‌లో పోస్ట్ చేసిన కీర్తి.. చాలా సంతోషంగా ఉంది. జాతి ర‌త్నాలు టీమ్‌కి కంగ్రాట్స్. ఈ న‌వ్వుల సునామీలో నేను భాగ‌మైనందుకు సంతోషంగా ఉంది అని కీర్తి సురేష్ రాసుకొచ్చారు.


    ఇదిలా ఉంటే కీర్తి సురేష్ న‌టించిన గుడ్ ల‌క్ స‌ఖి విడుద‌లకు సిద్ధంగా ఉంది. న‌గేష్ కుకునూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం జూన్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ప్ర‌స్తుతం కీర్తి తెలుగులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌లో న‌టిస్తోంది. ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
    Published by:Manjula S
    First published:

    Tags: Jathi Ratnalu, Keerthy Suresh

    తదుపరి వార్తలు