Kasturi Shankar: బిగ్ బాస్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు.. నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు..

Kasturi Shankar: తెలుగులో అన్నమయ్య లాంటి సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి శంకర్. ఈమె ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాలు కూడా చేసింది. దాంతో పాటు ఎప్పుడూ వివాదాలతోనే బిజీగా ఉంటుంది కస్తూరి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 30, 2020, 2:34 PM IST
Kasturi Shankar: బిగ్ బాస్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు.. నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు..
కస్తూరి శంకర్ (Kasturi Shankar/instagram)
  • Share this:
తెలుగులో అన్నమయ్య లాంటి సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి శంకర్. ఈమె ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాలు కూడా చేసింది. దాంతో పాటు ఎప్పుడూ వివాదాలతోనే బిజీగా ఉంటుంది కస్తూరి. ఎప్పటికప్పుడు సంచలన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్‌గా నిలుస్తుంటుంది. ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ మరోసారి దుమారం రేపుతున్నాయి. తమిళ బిగ్ బాస్‌పై ఈమె సంచలన వ్యాఖ్యలు చేసింది. గత సీజన్ అంటే బిగ్ బాస్ 3 తమిళంలో ఈమె కంటెస్టెంట్. ఇందులో పాల్గొన్నందుకు ఇప్పటి వరకు తనకు డబ్బులు రాలేదని.. అది పూర్తైపోయి కూడా ఏడాది అయిపోయిందని బహిరంగ కామెంట్స్ చేసింది కస్తూరి. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో ఛానెల్‌ను కూడా ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది.
కస్తూరి శంకర్ (Kasturi Shankar/instagram)
కస్తూరి శంకర్ (Kasturi Shankar/instagram)


విజయ్ టీవీకి కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు లేవంటూ సెటైర్లు వేసింది కస్తూరి. తనకు ఒక సంవత్సరానికి పైగా డబ్బులు చెల్లించలేదంటూ కామెంట్ చేసింది. కేవలం బయట అనాథ పిల్లల కోసమే ఈ షోలో తను పాల్గొన్నట్లు చెప్పింది కస్తూరి. తాను ఎప్పుడూ తప్పుడు వాగ్దానాలను నమ్మనంటూ చెప్పిన కస్తూరి.. చివరికి అదే జరిగిందంటూ చెప్పింది. ఇప్పటి వరకు తనకు డబ్బులు ఇవ్వకుండా అప్పుడే కొత్త సీజన్ కూడా మొదలు పెడుతున్నారని ఎద్దేవా చేసింది కస్తూరి. అక్టోబర్ 4 న బిగ్ బాస్ 4 తమిళ మొదలు కానుంది.

అందుకే ఇప్పుడు ఈమె డబ్బుల విషయం పోస్ట్ చేసింది. ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. చాలా మంది నెటిజన్లు కూడా ఈమెకు సపోర్ట్ చేస్తున్నారు. అలా పాల్గొన్న తర్వాత డబ్బులు చెల్లించకపోవడం అనేది కరెక్ట్ కాదంటూ కస్తూరికి అండగా నిలుస్తున్నారు. మరికొందరు మాత్రం కేవలం ప్రమోషన్, పబ్లిసిటీ కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తుందంటున్నారు. కస్తూరి తన పోస్ట్‌లో విజయ్ టీవీని ట్యాగ్ చేసినా కూడా ఇప్పటి వరకు ఆ ఛానల్ యాజమాన్యం ఎటువంటి స్పందన రాలేదు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: September 30, 2020, 2:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading