ప్లాస్టిక్ వ్యర్థాలతో పక్షి గూడు... ఆశ్చర్యపోయిన కేరళ నటి కనిహ...

Actress Kaniha Instagram Post : ఇది వరకు పక్షులు తమ గూళ్లను... ఈకలు, పుల్లలు, ఆకులతో కట్టుకునేవి. ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలతో కట్టుకుంటున్నాయి.

news18-telugu
Updated: February 14, 2020, 2:58 PM IST
ప్లాస్టిక్ వ్యర్థాలతో పక్షి గూడు... ఆశ్చర్యపోయిన కేరళ నటి కనిహ...
ప్లాస్టిక్ వ్యర్థాలతో పక్షి గూడు... ఆశ్చర్యపోయిన కేరళ నటి కనిహ... (credit - insta - kaniha_official)
  • Share this:
Actress Kaniha Instagram Post : కేరళ నటి దివ్య వెంకట సుబ్రహ్మణ్యం అలియాస్ కనిహ అలియాస్ కనిక... తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పోస్టులో... ఆమెను ఓ పక్షి గూడు ఫొటోను పెట్టింది. అది చాలా చిన్న గూడు. ఓ చిన్న పక్షి ఆ గూడును అల్లుకుంది. ఇందులో వింతేమీ లేదు. పక్షులన్నాక గూళ్లు కట్టుకోవడం కామన్. ఐతే... ఈ గూడు ఈకలు, పుల్లలు, ఆకులతో కట్టినది కాదట. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే... ఇందులో 90 శాతం మనుషులు పారేసిన చెత్తే ఉందని తెలిపింది కనిహ. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. ఈ గూడు సన్నటి కొమ్మకు వేలాడుతోంది. అందువల్ల గూడు చిన్నగా ఉంటేనే ఆ కొమ్మ నిలబడుతుంది. అదే గూడు పెద్దగా ఉంటే కొమ్మ విరిగిపోయే ప్రమాదం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పక్షి చిన్న గూడునే నిర్మించుకుంది. అది కూడా అత్యంత తక్కువ బరువు ఉంటే వస్తువులతో. సరైన బరువుతో, సరైన బ్యాలెన్సింగ్‌తో, సరైన షేపులో, హార్ట్ టచింగ్ అయ్యేలా గూడు కట్టుకుందని తెలిపింది కనిహ. 

View this post on Instagram
 

See how this little bird has used trash to build a beautiful home for herself..so beautifully crafted..a closer look at the nest will show how shes turned the tiniest trash into an engineering marvel.weighing just right,balancing just right,shaped just right.wow..so heart touching. Just imagine if a little Birdy can use trash sensibly how much more we humans can do with the trash we throw away?? #lessons from a bird #kaniha Backyard sightings💕


A post shared by Kaniha (@kaniha_official) on

ఓ చిన్న పక్షి... ఇలా చెత్తను గూడుగా ఉపయోగించుకోగలిగినప్పుడు... మనుషులమైన మనం... ప్లాస్టిక్ ఇతర వస్తువుల్ని రీసైక్లింగ్ చేసుకోలేమా అని అడుగుతోంది కనిహ. ఆ చిన్న పక్షి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అంటోంది.

కేరళ బ్యూటీ అయిన దివ్య వెంకటసుబ్రహ్మణ్యం... 2002లో తమిళ సినిమా ఫైవ్ స్టార్‌తో తెరంగేట్రం చేసి... మలయాళం, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించింది. భాగ్యదేవత, పఝాస్సీ రాజా లాంటి సినిమాలతో మాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు