Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: May 26, 2020, 2:46 PM IST
అయితే ఆ మధ్య మాత్రం ప్రేమ పెళ్లి మాత్రమే చేసుకుంటానని.. పైగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లను మాత్రం చేసుకోనని తెగేసి చెప్పింది ఈ చందమామ. ఇప్పుడు కాజల్ ప్రేమలో పడిందేమో అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి.
పౌర్ణమి రోజు చందమామలా మెరిసిపోతుంది కదా కాజల్ ఈ చీరలో. ఎప్పుడూ మోడ్రన్ డ్రస్సుల్లో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇలా ఒక్కసారిగా చీరలో కనిపించేసరికి కుర్రాళ్ల హార్ట్‌బీట్ కూడా సడన్‌గా పెరిగిపోయింది. అయినా అనుకుంటాం గానీ చీరలో ఉన్నంత సెక్సీనెస్ మోడ్రస్ క్యాస్ట్యూమ్‌లో ఎక్కడుంటుంది చెప్పండి..? ఎక్కడెక్కడ ఏయే అందాలు చూపించాలో అన్నీ చీరలోనే కనిపిస్తుంటాయి. ఇప్పుడు కాజల్ కూడా ఇదే చేసింది. తన అందాలను చూపించీ చూపించకుండానే చూపించింది.

కాజల్ అగర్వాల్ చీరకట్టు (kajal aggarwal saree)
పైగా నవ్వితే రత్నాలు రాలిపోతాయేమో అనేంత క్యూట్ స్మైల్‌తో పిచ్చెక్కించింది కాజల్. ప్రస్తుతం ఈమె స్టార్ హీరోలతో నటించడం లేదు కానీ స్టార్ హీరోయిన్‌గానే ఉంది. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమాలో నటిస్తుంది కాజల్. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది చందమామ. ఈ రెండు సినిమాలతో పాటు క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్ సినిమాలోనూ నటిస్తుంది ఈ భామ. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో
ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్.. మధ్య మధ్యలో హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ చందమామ. సరదాగా చీర కట్టుకుని చూపులతోనే ఊపిరి ఆపేసింది ఈ ముద్దుగుమ్మ. గతేడాది వరసగా స్టార్ హీరోలతో నటించిన కాజల్.. ఇప్పుడు మాత్రం చిన్న హీరోలు.. చిన్న సినిమాలతో సరిపెట్టుకుంటుంది. కానీ రెమ్యునరేషన్ మాత్రం సినిమాకు కోటిన్నరకు పైగానే తీసుకుంటూ రచ్చ చేస్తుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
May 26, 2020, 2:46 PM IST