టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై నటీ కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందా...ఉంటే..నటీ కాజల్ అగర్వాల్ వాటిని ఎలా ఎదుర్కోంది. క్యాస్టింగ్ కౌచ్‌పై కాజల్ స్పందన

news18-telugu
Updated: March 16, 2019, 1:02 AM IST
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై నటీ కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు
కాజల్ అగర్వాల్ Photo: Instagram/kajalaggarwalofficial
  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తున్న ఓ మ‌హ‌మ్మారి క్యాస్టింగ్ కౌచ్. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు మొత్తం ప‌ని గ‌ట్టుకుని మ‌రీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా బ‌య‌టికి వ‌చ్చి అంతా త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే విష‌యంపై కాజ‌ల్ కూడా స్పందించింది. సినిమా ఇండస్ట్రీలో తనమార్కెట్ గురించి తానేప్పుడు ఆలోచించలేదన్నారు. ఎప్పటి కప్పుడు తనకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. కాస్టింగ్‌ కౌచ్‌ అస్సలు లేదు అనను. బయటకు వచ్చి చెబుతున్న వాళ్లందరి బాధ వింటున్నాం. వాళ్లు అబద్ధాలు చెప్పరు కదా. అయితే నాకు అలాంటి అనుభవం ఏదీ కాలేదు. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్‌ ఉంది. చాలా సంవత్సరాలు పాటు షూటింగ్‌కి నాతో పాటు మా అమ్మగారు వచ్చేవారు. ఆవిడ పక్కనుండేవారు కనుక నాతో ఎవరూ మిస్‌ బిహేవ్‌ చేసేవారు కాదు. అలాగే బయట కూడా నావరకూ చేదు అనుభవం ఒక్కటి కూడా లేదు అని చెప్పుకొచ్చింది.కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోస్ Photo: Instagram/kajalaggarwalofficial
కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోస్ఇంకా మాట్లాడుతూ.. స్త్రీలు స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణం పని ప్రదేశంలో ఉండాలి. నేను పనిచేసే ప్రదేశంలో ‘నాతో పెట్టుకోవద్దు’ అనే సంకేతాలను ఎదుటివారికి పంపిస్తా. బహుశా నా జోలికి ఎవరూ రాకపోవడానికి అది కూడా ఓ కారణం అయ్యుండొచ్చు అని.. ఏది ఏమైనా కాస్టింగ్‌ కౌచ్‌ ఉందన్నది మాత్రం నిజం అనిపిస్తోంది..అని తెలిపింది.


సమంత అక్కినేని లేటెస్ట్ హాట్ ఫోటోలు
First published: March 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading